నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

Wed,September 12, 2018 01:34 AM

ఖమ్మం మామిళ్ళగూడెం, సెప్టెంబర్ 11 : దీన్ దయాల్ అంత్యోదయ యోజన జాతీయ జీవనోపాధుల పథకం కింద పట్టణ ప్రాంతాల నిరుద్యోగ యువతకు శిక్షణ అందించనున్నట్లు నగరపాలక కమిషనర్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఐసీఐసీఐ అకాడమి ఫర్ స్కిల్స్ జీవనోపాధికి అవకాశం-యువతకు ఒకేషనల్ కోర్సులలో మెరుగైన శిక్షణను అందించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం ఉద్యోగ నియమకాల కోసం యువతకు ఈ నెల 12వ తేదీన ఖమ్మం నగరంలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, మెప్మాలో ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఆసక్తి గల 18 నుంచి 26 సంవత్సరాల లోపు ఇంటర్మీడియట్ పూర్తి చేసిన నిరుద్యోగ యువతీ, యువకులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, పాస్‌ఫోర్ట్ పొటోలతో హాజరుకావాలని సూచించారు.

209
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles