రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి..


Wed,September 12, 2018 01:34 AM

దుమ్ముగూడెం/చర్ల, సెప్టెంబరు 11 : వాజేడు మండలంలోని బొగత జలపాతాన్ని చూసి తిరుగు ప్రయాణంలో కారు ప్రమాదానికై గురై ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలైన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. పాల్వంచ పట్టణంలోని గొల్లగూడెంకు చెందిన చింత వెంకటేష్, ప్రవీణ్, తెల్లం స్వాతి, ఇంద్య రోషిణిలు వాజేడు మండలంలోని బొగల జలపాతాన్ని చూసేందుకు పాల్వంచ నుంచి కారు(ఏపీ20ఏయూ0811)లో వెళ్లి బొగత జలపాతాన్ని చూసి తిరిగి వస్తుండగా చర్లమండలం సుబ్బంపేట ఎదిరగుట్ట శివారులోని మూలమలుపు వద్ద కారు ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న చింతా వెంకటేష్, ప్రవీణ్‌లు అక్కడికక్కడే మృతిచెందగా స్వాతి, రోషిణిలకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన క్షతగాత్రులను చర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. ఒక్కసారిగా కారు ప్రమాదానికి గురైన సంఘటన తెలియడంతో స్థానికులు అక్కడకు చేరుకుని పరిస్థితిని పోలీసులకు వివరించారు.

142
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...