కారు జోరు

Mon,September 10, 2018 01:50 AM

- ప్రచారంలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు
- టిక్కెట్ల వేటలో ప్రతిపక్ష నేతలు
- జిల్లా వ్యాప్తంగా గులాబీతో ఎన్నికల వాతావరణం
నమస్తే తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన టీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయడం ద్వారా రాష్ట్ర సాధన కలను సాకారం చేసింది. స్వయంగా పార్టీ రథసారధి, సీఎం కేసీఆర్ అభ్యర్ధ్థులను ప్రకటించి ఎన్నికలశంఖారావాన్ని పూరించడంతో జిల్లాలో గులాబీ శ్రేణుల్లో అమితోత్సాహం నెలకొంది. ప్రతిపక్ష పార్టీలకు చెందినవారు పొత్తులు, సీట్ల కోసం హైదరాబాద్ వెళ్లి మకాం వేశారు. టీడీపీ మినహా కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం జాతీయ పార్టీల వైఖరిని ఢిల్లీ నేతలు ఖరారు చేయాల్సి ఉన్నందున, టిక్కెట్లను ఆశించే కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం నాయకులంతా హైదరాబాద్ వెళ్లారు. ఎవరికి వారు తమ లాబీయింగ్‌ను ప్రయోగిస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐల మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉన్నందున జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఏయే పార్టీలకు ఏయే సీట్లను కేటాయించాలనే అంశంపై కసరత్తు జరుగుతోంది. ఎవరికీ వారు తమ పార్టీకే పొత్తులో సీట్లు వచ్చాయని అభ్యర్థుల పేర్లతో సహా సోషల్ మీడియా లో ప్రచారం చేసుకుంటున్నారు. ఖరారు కానీ పొత్తు లు, సీట్ల విషయంలో జరుగుతున్న సోషల్ మీడియా ప్రచారం ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తోంది.

ఒక వైపు టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఐదు నియోజకవర్గాల అభ్యర్థులు జలగం వెంకటరావు, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావ్‌లు వారి నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. మోటర్ సైకిళ్ల ర్యాలీలు, అంతర్గత సమావేశాలు, ఇతర పార్టీల నుంచి జరుగుతున్న చేరికలతో ఎన్నికల వ్యూహరచనతో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారంలో ముందంజలో నిలిచారు. టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అనుబంధ సంఘాల యువజన, విద్యార్థి, మ హిళ, కార్మిక విభాగాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఇప్పటికే తమ అభ్యర్ధ్థులతో ఎన్నికల్లో విజ యం కోసం అనుసరించాల్సిన మార్గాలపై చర్చిస్తున్నారు. ఈ పరిణామాలతో ప్రతిపక్ష పార్టీలకు చెందిన శ్రేణులన్నీ నిరుత్సాహంతో తమ పార్టీ అభ్యర్ధ్థులను ఎప్పుడు ప్రకటిస్తారనే ఆలోచనలతో నిరీక్షిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల మధ్య పొత్తులు, సీట్ల సర్ధుబాటు కొలిక్కి వచ్చేసరికి ఎక్కువ సమయం పట్టే అవకాశాలు కనపడుతున్నాయి.

అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్ధ్థుల ప్రచారం
టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఎవరికీ వారు తమకు అనుకూలమైన విధానాలతో ముందుకు వెళ్తున్నారు. పార్టీ శ్రేణు లు సైతం అభ్యర్ధ్థులను అనుసరిస్తూ ప్రచారంలో పా ల్గొంటున్నారు. ఎన్నికల షెడ్యూల్డ్‌లో భాగంగా ఓటర్ల జాబితాలో కొత్త ఓటర్ల నమోదు, సవరణలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయడంతో టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులన్నీ ఓటర్ల షెడ్యూల్‌కు సంబంధించిన పనులు చేపట్టేందుకు కార్యాచరణను రూపొందించుకుంటున్నారు. జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే టీఆర్‌ఎస్ ఎన్నికల పరంగా ముందంజలో నిలుస్తుండగా, ఇతర పార్టీలు ఎలా ముందుకుపోవాలో తెలియని గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాయి.

అభివృద్ధి, సంక్షేమ పథకాలే ప్రచారస్ర్తాలు
నాలుగున్నర ఏళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రధాన ప్రచార అస్ర్తాలుగా ఈ ఎన్నికల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి తెలపాలని టీఆర్‌ఎస్ అభ్యర్థులు తమ పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే వివిధ రూపాల్లో ప్రభుత్వ పథకాలను ఓటర్లకు వివరిస్తున్నారు. టీఆర్‌ఎస్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతీ కుటుంబానికీ ఏదో ఒక రూపంలో ప్రయోజనాన్ని చేకూర్చాయి. ఈ విషయాన్ని కూడా ఆయా కుటుంబాలవారు ఆలోచన చేసుకునే విధంగా, టీఆర్‌ఎస్‌కు అండగా నిలిచే విధంగా కలుసుకొని పార్టీ అభ్యర్ధ్థులను గెలిపించి కోరుతున్నారు. మళ్లీ కేసీఆర్‌నే సీఎంగా చేయడం ద్వారా మరింత ప్రగతిని, సంక్షేమాన్ని పొందేందుకు సహకరించాలనే రీతిలో ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు కేవలం టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం మినహా వారికి చెప్పుకోవడానికి బలమైన అంశాలేవీ సుదూరంలో కూడా కనిపించడంలేదు. ఒక వేళ తమ అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిస్తే ఎలా ముందుకు వెళ్లాలనే అంశంలో కూడా ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు ఒక స్పష్టమైన వైఖరికి రాలేదు. సీఎం కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాల పరంపర నిరంతరం కొనసాగాలనే ఆలోచనతోనే ఎన్నికల బరిలో నిలవడంతో జిల్లా వ్యాప్తంగా గులాబీ తనదైన వేగంతో దూసుకుపోతుండగా, ప్రతిపక్ష పార్టీలు అస్పష్టమైన వైఖరులతో అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నాయి.

295
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles