అద్భుత కళలకు వేదిక తెలంగాణ కళాపరిషత్

Mon,September 10, 2018 01:49 AM

ఖమ్మం కల్చరల్: అద్భుతమైన కళల ప్రదర్శనకు తెలంగాణ కళాపరిషత్ మంచి వేదిక అని ఖమ్మం పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఖమ్మం నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో తెలంగాణ కళాపరిషత్ ఆధ్వర్యంలో మూడురోజులుగా జరుగుతున్న కళాజాతర ముగింపు వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. తెలంగాణ కళాపరిషత్ చాలా మహోన్నత కార్యాక్రమాలను నిర్వహిస్తోందన్నారు. ముఖ్యంగా ఈ కళాజాతరను కేరళ విపత్తులకు సంఘీభావంగా నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. కళాకారులు సామాజిక బాధ్యతగా చేసే ప్రదర్శనలు లక్షల మందిని ప్రభావితం చేస్తాయని, తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ కళాకారుల పాత్ర గొప్పదన్నారు. కళలు విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంచుతాయని పేర్కొన్నారు. కళాపరిషత్ వ్యవస్థాపక అద్యక్షుడు పగిడిపల్లి రాజారావు మాట్లాడుతూ..

సమాజాన్ని చైతన్యవంతం చేయవలసిన బాధ్యత కళాకారులపై ఉందన్నారు. ఈ సందర్భంగా వీరబ్రహ్మచారి కోలాట బృందం రైతులపై థీం ప్రదర్శనలు, జాక్సన్ మాస్టర్ కేరళ విపత్తులపై నృత్య ప్రదర్శనలు, అమ్మ అనాథాశ్రమ చిన్నారులు రైతుల పాటలు, సన్నాయి శ్రీనివాసు సంప్రదాయ సంగీతం వంటి వివిధ కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం ఎంపీ కళాకారులకు మెమొంటోలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. గ్రంథాలయ చైర్మన్ ఎంఏ ఖమర్.. పగిడిపల్లి రాజారావు దర్శకత్వం వహించిన బంగారుబొమ్మ లఘుచిత్రం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌జీవోస్ హౌజింగ్ సొసైటీ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, డాక్టర్ క్వాల్లిన్, అద్దంకి రాజా, కళాపరిషత్ బాధ్యులు కడివెండి వేణుగోపాల్, ఉపాధ్యక్షుడు పగిడిపల్లి సూర్యం, ఐలయ్య, శివ రాథోడ్, శోభన్, ఫణిందర్, వెంకన్న, పోతుగంటి వెంకటేశ్వర్లు, మట్ట ఆరోగ్యం తదితరులు పాల్గొన్నారు.

231
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles