కాళోజీ సేవలు చిరస్మరణీయం..

Mon,September 10, 2018 01:49 AM

ఖమ్మం వైరారోడ్: తెలంగాణ భాషా కవి, వైతాళికుడు కాళోజీ నారాయణ అని, తెలంగాణ యాసను కాపాడటంలో ఆయన చేసిన కృషి గర్హనీయమని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కాళోజీ నారాయణ జయంతి వేడుకలు ఖమ్మంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర ఉద్యమంలో కాళోజీ ఎనలేని పోరాటాలు చేశారని గుర్తుచేశారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో అరెస్టులకు గురై ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నిర్వహించిన పోరాటంలో కీలకపాత్ర పోషించారన్నారు. అంతే కాకుండా తెలంగాణ ఉద్యమంలో కాళోజీ సేవలు మరవలేనివన్నారు. తెలంగాణ భాష, యాసను కాపాడిన ఆయన సేవలను గుర్తించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళోజీ జయంతి రోజున భాషా దినోత్సవంగా ప్రకటించిందన్నారు.

తెలంగాణ భవన్‌లో..
మయూరిసెంటర్: తెలంగాణ వైతాళికుడు, ప్రజాకవి, రచయిత, ఉద్యమకారుడు కాళోజీ నారాయణరావు రచనలు ప్రజల్లో ఆనాడు చైతన్య స్ఫూర్తిని నింపాయని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, టీఎస్ ఐడీసీ కార్పొరేషన్ చైర్మన్ ఎస్‌బీ బేగ్, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు అన్నారు. ఆదివారం కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని తెలంగాణ భవన్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాడు కాళోజీ అన్నట్లుగానే నేడు దొంగలంతా ఒకటై ప్రజల ముందుకు వస్తున్నారని.. ఆయన స్ఫూర్తితో దొంగలను తరిమే సమయం అసన్నమైందన్నారు.

కాళోజీ సేవలకు తెలంగాణ ప్రభుత్వం 2014 నుంచి ఆయన జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తూ వస్తోందన్నారు. అభివృద్ధిని ధ్వంసం చేసిన కాంగ్రెస్, టీడీపీలు, ప్రజలు తిరస్కరించిన సీపీఎం వంటి పార్టీలు మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాతా మధు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, భీరెడ్డి నాగచంద్రారెడ్డి, సాధు రమేష్‌రెడ్డి, కమర్తపు మురళి, బిచ్చాల తిరుమలరావు, టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర కార్యదర్శి రడం సురేష్, జల్లా కో ఆర్డినేటర్ బాజీబాబా, మందడపు సుధాకర్, మామిళ్లపల్లి రాంబాబు, ఆల్ల వెంకటరెడ్డి, ఆరజేందర్, బెల్లం వేణు, బోయినపల్లి సుధాకర్, ఎంపీపీ రామసహాయ వెంకటరెడ్డి, ఆసిఫ్‌పాషా, జడ్‌పీటీసీ వడిత్యా రాంచంద్రు నాయక్, ఎంపీటీసీ ఇంటూరి శేఖర్, హనుమంతరెడ్డి, భిక్షం తదితరులు పాల్గొన్నారు.

211
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles