లోక్ అదాలత్‌లో 387 కేసుల పరిష్కారం

Sun,September 9, 2018 01:27 AM

కరీంనగర్ లీగల్ : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 387 కేసులను పరిష్కరించారు. రాష్ట్రంలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా తొమ్మిదో స్థానంలో నిలిచిందని న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి కుష తెలిపారు. కరీంనగర్‌లో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమాన్ని బార్ అసోసియేషన్ న్యాయవాదులు బహిష్కరించారు. గత బుధవారం నుంచి జిల్లాల కోర్టులోని న్యాయవాదులు రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు పరచాలని విధులు బహిష్కరిస్తున్నారు. ఈ ఉత్తర్వుల విషయమై తమకు సహకరించాలని ఇటీవల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథిని కలువగా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని న్యాయవాదులు ఆరోపించారు.

ఈ విషయమై శనివారం సమావేశమై జిల్లా కోర్టులో శనివారం జరిగే లోక్ అదాలత్ కార్యక్రమాలను బహిష్కరించాలని, సోమవారం కూడా న్యాయవాదులు కోర్టు విధులకు హాజరుకాకూడదని తీర్మానించారు. దీంతో కార్యక్రమానికి వచ్చిన ఇన్సూరెన్స్ అధికారులు, కక్షిదారులు వెను తిరిగి వెళ్లిపోయారు. లోక్ అదాలత్ కార్యక్రమం న్యాయవాదులు లేక మొట్ట మొదటిసారిగా నిర్వహించలేకపోయారు. ఇదిలా ఉండగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథిని విలేకరులు కలువగా.. తాను న్యాయవాదుల పట్ల అగౌరవంగా ప్రవర్తించలేదన్నారు. లోక్ అదాలత్ కార్యక్రమాలను బహిష్కరిస్తున్న విషయంపై కూడా ముందస్తుగా తమకు సమాచారం లేదని, న్యాయవాదులు మరో విధంగా ఊహించుకున్నారేమోనని అన్నారు.

177
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles