చీకట్లకు చరమగీతం!

Sat,September 8, 2018 12:54 AM

ఖమ్మం, నమస్తేతెలంగాణ: ఏళ్ల తరబడి వేధిస్తున్న అన్నిరకాల కంటి సమస్యలకు చిటికెలో పరిష్కారం లభిస్తున్నది. కంటి వెలుగు జిల్లా లో దిగ్విజయంగా కొనసాగుతున్నది. జిల్లా వై ద్యారోగ్యశాఖ యావత్ ఖమ్మం జిల్లావ్యాప్తంగా 32 కంటి వైద్యశిభిరాలను ఏర్పాటు చేయగా, శ ని, ఆది వారాలు, ఇతర సెలవు దినాలు మినహా ఇతర అన్ని రోజుల్లో సంబందిత వైద్యారోగ్యశాఖ సిబ్బంది నిర్వహిస్తున్న కంటి పరీక్షలు చీకట్లకు చరమగీతం పాడుతున్నయ్. అవగాహనా లో పంతో, ప్రైవేట్‌లో వైద్యం చేయించుకోలేని స్థితి లో అరకొర కంటి చూపుతోనే జీవితాలను నెట్టుకొస్తున్న ఎందరో అభాగ్యులందరికీ కంటి వెలు గు సరికొత్త వెలుగును ప్రసాదిస్తున్నది. దేశంలో ఎక్కడాలేని విధంగా కంటి సంబంధ సమస్యలకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న వైద్యసేవలతో క్రమక్రమంగా చీకట్లు కరిగిపోతున్నయ్. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు కంటి వైద్యశిబిరాలకు వెళ్తూ ఉచిత సేవలను వినియోగించుకుంటున్నారు. తద్వారా సీఎం కేసీఆర్‌కు మనస్పూర్తిగా జేజేలు పలుకుతున్నరు.

* జిల్లాలో 88 గ్రామాల్లో ప్రక్రియ పూర్తి
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కలిపి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ కొండల్‌రావు సారధ్యంలో మొత్తం 32 కంటి వైద్యశిభిరాలను ఏర్పాటు చేశారు. వాటి పరిధిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అహర్నిశలు శ్రమించిన సంబందిత వైద్యాధికారులు, సిబ్భంది శుక్రవారం ఒక్కరోజే 5,866 మందికి కంటి పరీక్షలు నిర్వహించటం గమనార్హం. ఆఫ్‌లైన్ ప్రకారం అయితే వీరి సంఖ్య 7,333గా నమోదయ్యింది. జిల్లాలో ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు మొత్తం 87,993 మంది కంటి పరీక్షలు నిర్వహించుకున్నరు. వీరిలో మహిళలు 44,348, పురుషులు 34,035 మంది ఉన్నారు. కాగా దగ్గరి చూపుతో బాధపడుతున్న వారికి మొత్తం 19,415 మందికి రీడింగ్ కళ్లద్దాలను అందించారు. దూరపు చూపు సమస్య ఉన్నటువంటి 20,383 మందికి కళ్లద్దాలు కావాలని ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వానికి నివేదించారు. ఈక్రమంలోనే వివిధ దీర్ఘకాలిక సమస్యలతో ఇబ్భందులు ఎదుర్కొంటూ ఆపరేషన్లు చేయాల్సిన మొత్తం 10,574 మంది వివరాలను సైతం ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. ఖమ్మం దవాఖానాలకు 7,755, హైదరాబాద్‌కు 2,847 మందిని సిఫారస్ చేశారు. వారందరికీ ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్న జిల్లా అధికారులు ప్రభుత్వ లక్ష్యం మేరకు తీవ్రంగా కృషిచేస్తున్నరు. కాగా తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నరు. పలు సందర్భాల్లో వైద్యశిభిరాలను సందర్శించి సంబందిత యంత్రాంగానికి దిశానిర్ధేశం చేస్తున్నరు. శని, ఆదివారాలు సెలవుదినం అయినందున నేడు, రేపు జిల్లాలో కంటి వైద్యశిభిరాలు పనిచేయవని డీఎంహెచ్‌వో డాక్టర్ ఏ కొండల్‌రావు వెల్లడించారు.

అభివృద్ధి చిహ్నం అక్షరం..
ఖమ్మం ఎడ్యుకేషన్: అక్షరం అభివృద్ధికి చి హ్నంగా మారుతుంది.. అక్షరంతోనే డిజిటల్ వ్యవస్థ మెరుగుపడుతుంది.. అక్షరాలను దిద్దేందుకు వయోజనులను సైతం కదిలిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. మారుమూల ప్రాంతాల్లో చ దువుకోలేని పేద ప్రజల కోసం సాక్షరభారత్ ద్వారా అక్షరాస్యత పెంచుతూ వెలుగులు నిం పుతున్నది. వ్యవస్థను బంగారు తెలంగాణ దిశ గా మరల్చేందుకు కుటుంబంతో పాటు గ్రా మం.. రాష్ట్రం.. దేశం అభివృద్ధి పథంలో పయనించాలన్నా అక్షరమే ఆయుధంగా అడుగులు వేస్తున్నది. అందరూ అక్షరాస్యులైన నాడే దేశం అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తుంది అనే భావనతో కేంద్ర ప్రభుత్వం వయోజన విద్య కార్యక్రమానికి అంకురార్పణ చేసింది. చదువు.. వెలుగు అనే కార్యక్రమాలను సైతం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది.

ఐదు దశల్లో వేల మందిని..
సాక్షరభారత్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2008లో ప్రవేశపెట్టింది. జిల్లాలో 2010లో కార్యక్రమాన్ని ప్రారంభించారు. 15-50ఏళ్ల లోపు ఉన్న 6.95లక్షల నిరాక్షరాస్యులను గుర్తించి, వారిని అక్షరాస్యులను చేయాలనేది లక్ష్యం. అందుకోసం జిల్లాలో 21 మండలాల్లో 390కి పైగా గ్రామ పంచాయతీల్లో ప్రారంభించిన సాక్షరభారత్ కార్యక్రమంలో ప్రతి మండలానికి ఓ మండల సమన్వయకర్త, 780మందికి పైగా గ్రామసమన్వయకర్తలు, వారి పరిధిలో 3వేల మంది వలంటీర్లు పని చేస్తున్నారు. సాక్షరభారత్ ఇప్పటి వరకు ఐదు దశల్లో వివిద పేర్లతో అక్షరాస్యత దశలను పూర్తి చేసింది. తొలి విడతలో 70వేల మందిని సాక్షరభారత్ కేం ద్రాలు నమోదు చేసుకున్నారు. 38.394మంది ని అక్షరాస్యులను చేసినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. 2వ విడతలోనూ 70వేల మందిని నమోదు చేసుకుని, ఈసారి 59,439మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దినట్లుగా అధికారులు లెక్కలు చెబుతున్నాయి. 3వ విడతలో 2లక్షల మందిని కేంద్రాల్లో నమోదు చేసుకుని 70వేలకు మందికి పైగా అక్షరాలు నేర్పినట్లు అధికారులు చెబుతున్నారు. 4వ విడతలో 79.40 శాతం అక్షరాస్యత సాధించినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న అక్షరాస్యతశాతంతో పోలిస్తే తెలంగాణలో అక్షరాస్యత శాతం కొంత మెరుగ్గానే కన్పిస్తోంది.

పల్లెలే లక్ష్యంగా..
పట్టణ ప్రాంతాల్లో కన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే అక్షరాస్యత పెంపును అత్యవసరంగా భావిస్తూ ఆయా గ్రామీణ ప్రాంతాల్లో వాలంటీర్ల సహాకారంతో అక్షరాస్యత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారికి అనువుగా ఉన్న సమయాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో సైతం అక్షరాలు దిద్దించేకార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఉపాధిపథకం కూలీలకు, ఐకేపీలోని మహిళలందరికీ చదువు నేర్పించాలన్నదే సాక్షరభారత్ లక్ష్యం. గ్రామ దీపికలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, విద్యావాలంటీర్ల సహకారంతో అందరిని అక్షరాస్యులుగా మార్చాలి. వారు భాగస్వామ్యం కాకపోవడంతో గ్రామ సమన్వయకర్తలే కేంద్రాన్ని నడుపుతున్నారు. మన్యంలో అక్షరాస్యత శాతం మసకబరుతుంది. ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసిన వయోజన కేంద్రాల ద్వారా ప్రాధమిక అక్షరాస్యత, ప్రాధమిక విద్య, విధ్యాభివృద్ది, నిరంతర విద్య అంటూ నాలుగు విడతల్లో నిరక్షరాస్యులను సంపూర్ణ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేలా కార్యక్రమాలు నిర్వహించారు.

జిల్లా అక్షరాస్యత 65.8గా నమోదు..
సమగ్ర కుటుంబ సర్వే ద్వారా అక్షరాస్యత శాతం వివరాలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణలో అక్షరాస్యత శాతం పురుషులు 75.6 శాతం, మహిళలు 58.77శాతం, మొత్తం 67.22శాతంగా అదికారులు లెక్కలు తేల్చారు. ఇదే సర్వే ద్వారా ఖమ్మం జిల్లాలో పురుషులు 72.30శాతం, మహిళలు-57.44శాతం, మొత్తం 65.8శాతం అక్షరాస్యులు ఉన్నారు. ఖమ్మం నగర పరిధిలో నిరాక్షరాస్యులు పురుషులు 35,059, మహిళలు 66,075, మొత్తంగా 1,01,352 మంది ఉన్నట్లు అదికారులు లెక్కలు చెబుతున్నారు. సాక్షర భారత్ ద్వారా 5దశల్లో అక్షరాస్యత సాధించిన వారు మహిళలు 2,39,060, పురుషులు 45,480, మొత్తం 2,84,540 మంది ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.

ప్రత్యేక ప్రణాళికకు కలెక్టర్ ఆదేశం
జిల్లాలోని మహిళలను పూర్ధి స్ధాయిలో అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా వయోజన విద్య అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. మహిళా అక్షరాస్యత పెంచటానికి, ఇప్పటికి వరకు నిర్వహించిన కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. 15 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయస్సు గలిగిన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేలా ప్రత్యేక ప్రణాళికలు రూపోందించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న 53శాతంను పెంచేందుకు టీసీఎస్ సంస్ధ సహాకారంతో కృషి చేయాలని పేర్కోన్నారు. కలెక్టర్ నిర్వహించిన సమావేశంలో టీసీఎస్ ప్రతినిధులు సైతం హజరయ్యారు. మూడు నెలల్లో నిర్వహించే కార్యక్రమాల ద్వారా ఎంత మందిని అక్షరాస్యులుగా తయారుచేయవచ్చు, 6 నెలల శిక్షణతో ఎంతమందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దవచ్చు అనే అంశాలపై ప్రణాళిక రూపొందిస్తున్నారు.
204
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles