ఎన్నికల సమయం ప్రతీ విషయం జాగ్రత్తగా చూస్తాం

Sat,September 8, 2018 12:54 AM

కూసుమంచి, నమస్తే తెలంగాణ: ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో ప్రతీ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుందని కింది స్థాయి సిబ్బందికి క్షేత్రస్థాయిలో విచారణ సరీగా చేపట్టేలా చూస్తామని రూరల్ ఏసీపీ రమేష్ అన్నారు. కూసుమంచిలోని సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం రాత్రి మొదటి విజిటింగ్‌లో భాగంగా విలేకరులతో మాట్లాడారు. పాలేరు నియోజకవర్గ ప్రజల్లో చైతన్యం ఎక్కువన్నారు. ప్రతీ గ్రామాన్ని పోలీస్ సిబ్బంది ఎస్సై సందర్శించేలా చూస్తామని తెలిపారు. చట్టం పరిధిలోబడి అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. చైన్ స్నాకింగ్‌ల కట్టడికి ప్రయత్నిస్తామన్నారు. సీసీ కెమేరాలు ఎక్కువగా ఏర్పాటు చేసేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఎస్సైలు కొత్తగా రావడంతో అందరితో కలిసి ముఖ్య గ్రామాల్లో పర్యటిస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అసాంఘాక కార్యక్రమాలను ఉపేక్షించేది లేదన్నారు. ఇందులో సీఐ వసంత్‌కుమార్, తిరుమలాయపాలెం ఎస్సై సరవయ్య,నేలకొండపల్లి ఎస్సై సుమన్ తదితరులు పాల్గొన్నారు.

విధి నిర్వహణలో అలసత్వం తగదు..
ప్రతీ ఫిర్యాదుపై దృష్టి పెట్టాలనీ, ఎక్కడా అలసత్వం లేకుండా చూడాలని రూరల్ ఏసీపీ రమేశ్ సూచించారు. కూసుమంచిలోని సర్కిల్ సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. వచ్చేది ఎన్నికల సమయం కావడంతో మరిత జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పోలీసులు క్షేత్రస్థాయిలో ఫిర్యాదుల పరిశీలన విషయంలో మరితం లోతుగా చూడాలని కోరారు. ఎక్కడా ఇబ్బంది లేకుండా చట్టం పరిధిలో పనిచేయాలని అన్నారు. ప్రతీ పోలీస్ బాధ్యతగా పనిచేయాలని కోరారు. ఇందులో సీఐ వసంత్ కుమార్ ,నేలకొండపల్లి ఎస్సై సుమన్, తిరుమాయపాలెం ఎస్సై సారయ్య, కూసుమంచి సిబ్బంది పాల్గొన్నారు.


141
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles