మానసిక దృఢత్వం కోసమే ధ్యానం

Tue,December 10, 2019 01:17 AM

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: మానసిక దృఢత్వం కోసం ప్రతి నిత్యం ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌ సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో శ్రీరామచంద్ర మిషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన హార్ట్‌ ఫుల్‌నెస్‌ మెడిటేషన్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధ్యానం ఎందుకు చేయాలనే అవగాహన అందరిలో రావాలన్నారు. మన కోసం మనం చేసుకునే కార్యక్రమాలే యోగా, ధ్యానం అన్నారు. ఇవి సనాతన ధర్మానికి సంబంధించి మన పూర్వీకులు ఇచ్చిన గొప్ప వరాలనీ, వీటిని మతానికి సంబంధించినవిగా భావించవద్దన్నారు. రోజుకు 30 నిమిషాలైనా ధ్యానం చేయడం వల్ల మానసిక దృఢత్వంతో పాటు చేసే పనిలో చిత్తశుద్ధి పెరిగి అవి తప్పులు లేకుండా పూర్తవుతాయన్నారు. శారీరక రుగ్మత గురించే ఆలోచిస్తాం కానీ మానసిక ఆరోగ్యానికి ప్రాముఖ్యతను ఇవ్వలేకపోతున్నామన్నాని జిల్లా రెవెన్యూ అధికారి ప్రావీణ్య అన్నారు. ఎప్పటి నుంచో చేయాలనుకునే పనులు చేయలేకపోతున్నామనే తపన అందరిలో ఉన్నప్పటికీ అది సాధ్యం కావడం లేదన్నారు. మనస్సు ఆధీనంలో ఉంచుకోవడానికి ప్రతిరోజూ ధ్యానం చేయడం వల్ల ఎలాంటి మానసిక రుగ్మతలు లేకుండా జీవించవచ్చన్నారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో మూడు రోజుల పాటు నిర్వహించే హార్ట్‌ ఫుల్‌నెస్‌ మెడిటేషన్‌ కార్యక్రమానికి జిల్లా అధికారులతో పాటు సహోద్యోగులు విధిగా హాజరుకావాలని ఆదేశించారు. శ్రీరామచంద్ర మిషన్‌ ప్రతినిధులు సింగమరాజు, రామకృష్ణారెడ్డి, రాంరెడ్డి, ప్రభాకరాచారి, పద్మజ, సుమలత, జిల్లా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

95
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles