ఉల్లిగడ్డలు అధిక ధరలకు అమ్మితే చర్యలు

Tue,December 10, 2019 01:16 AM

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: మార్కెట్‌లో ఉల్లి గడ్డలను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్‌ కలెక్టర్‌ జీవీ శ్యామ్‌ ప్రసాద్‌లాల్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఉల్లి ధరల నియంత్రణపై అధికారులు, ఉల్లిగడ్డల హోల్‌సేల్‌ డీలర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, మార్కెట్‌లో ఉల్లిగడ్డల సరఫరా తక్కువగా ఉందని, ఇదే అదనుగా భావించి వ్యా పారులు ఉల్లి గడ్డలను నిల్వ చేసుకుని అధిక ధరలకు విక్రయించవద్దన్నారు. ప్రస్తుతం కరీంనగర్‌కు ప్రతీరోజు 20 నుంచి 30టన్నుల ఉల్లి గడ్డలు దిగుమతి అవుతున్నట్లు చెప్పారు. వాటిలో ఏ-గ్రేడ్‌ రకానికి రూ.90, బీ-గ్రేడ్‌ రకానికి రూ.70చొప్పున విక్రయిస్తున్నామని డీలర్లు తెలిపారు. ఇంతకు ముందు ప్రతీరోజు 40నుంచి 50 టన్ను ల ఉల్లిగడ్డలు నగరానికి దిగుమతి అయ్యేదని వారు వివరించారు. వ్యాపారస్తులు వచ్చిన రేటు కన్నా కొంత లాభం చూసుకుని ప్రజలకు తక్కువ ధరలకు అమ్మాలన్నారు. అధిక ధరలకు విక్రయించవద్దని సూచించారు.

ప్లాస్టిక్‌ బాటిళ్లలో పెట్రోల్‌ పోయవద్దు
జిల్లాలోని అన్ని పెట్రోల్‌ బంకుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్‌ బాటిళ్లలో పెట్రోల్‌, డీజీల్‌ పోయవద్దని జేసీ శ్యామ్‌ప్రసాద్‌లాల్‌ అన్ని పెట్రో ల్‌ బంకుల యజమానులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి సురేశ్‌రెడ్డి, పౌరసరఫరాల సంస్థ డీఎం శ్రీకాంత్‌, ఉల్లిగడ్డల హోల్‌ సేల్‌ డీలర్లు పాల్గొన్నారు.

104
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles