15న ట్రినిటి గణిత ఒలింపియాడ్‌

Tue,December 10, 2019 01:16 AM

కరీంనగర్‌ ఎడ్యుకేషన్‌: ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామనుజన్‌ జయంతిని పురస్కరించుకొని కరీంనగర్‌ ట్రినిటి జూనియర్‌ కళాశాల ఆధ్వర్యంలో ఈనెల 15న గణిత ఒలింపియాడ్‌ పరీక్ష నిర్వహిస్తున్నామని ఆ విద్యాసంస్థల అధినేత దాసరి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించి, మాట్లాడారు. గణితంలో విద్యార్థులప్రతిభను వెలికితీసేందుకు పదో తరగతి విద్యార్థులకు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు సంబంధిత పాఠశాలల్లోనే పరీక్షను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థికి 6 వేలు, రెండోస్థానంలో నిలిచినవారికి 5వేలు, మూడో స్థానం పొందినవారికి 3,500, నాలుగో స్థానం 3 వేలు, ఐదో స్థానం వేలు, ఆరో స్థానం సాధించిన విద్యార్థులకు 1,500 నగదు పురస్కారాన్ని అందజేస్తామని ఆయన చెప్పారు. అలాగే, కన్సోలేషన్‌ బహుమతిగా 20మంది విద్యార్థులకు వెయ్యి అందజేస్తామని ప్రకటించారు. ఈ నెల 22న జరిగే కార్యక్రమంలో వీరికి నగదుతోపాటు ప్రశంసాపత్రాలను అందిస్తామని తెలిపారు. వివరాలకు 98495-53850 నంబర్‌ను సంప్రదించాలని ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు.

81
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles