చుక్క లతకు జాతీయ స్థాయి అవార్డు

Tue,December 10, 2019 01:16 AM

ముకరంపుర: కరీంనగర్‌కు చెందిన ఉస్మానియా విశ్వవిద్యాలయం రీసెర్చ్‌ స్కాలర్‌ చుక్క లతకు అంబేద్కర్‌ నేషనల్‌ ఫెల్లోషిప్‌ అవార్డు దక్కింది. ఢిల్లోలోని పంచశీల ఆశ్రమంలో దళిత సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ సుమన్‌ అక్షర్‌ చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ స్థాపించిన ఈ అకాడమీ అవార్డు ప్రదానోత్సవంలో భాగంగా ఈ నెల 8, 9 తేదీల్లో ఢిల్లీ లో సాహిత్యం, సోషల్‌ సర్వీస్‌ కార్యక్రమాల్లో పా ల్గొన్న వారికి అవార్డులు ప్రదానం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యాఉద్యోగాల సంబంధాలపై రీసెర్చ్‌ చేస్తున్న చుక్క లత రాసిన పరిశోధన పత్రాలకు, ఆరేళ్లుగా చేస్తున్న సేవా కార్యక్ర మాలకు గాను రాష్ట్ర అధ్యక్షుడు సౌత్‌జోన్‌ సెక్రెటరీ డాక్టర్‌ జితేందర్‌ అవార్డుకు ఎంపిక చేశారు. అవా ర్డు మరింత బాధ్యత పెంచిందనీ, సహకరించిన జితేందర్‌కు లత కృతజ్ఞతలు తెలిపారు.

65
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles