జాతీయ అథ్లెటిక్స్‌ పోటీల్లో ప్రతిభ

Mon,December 9, 2019 12:28 AM

కరీంనగర్‌ స్పోర్ట్స్‌: పంజాబ్‌ రాష్ట్రంలోని సాంగురూర్‌లో డిసెంబర్‌ 4 నుంచి 8వరకు జరిగిన ఎస్జీఎఫ్‌ఐ జాతీయ పాఠశాలల అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో రాష్ట్ర జట్టుకు చెందిన క్రీడాకారులు అత్యంత ప్రతిభ కనబర్చి కాంస్య పతకం సాధించారు. అండర్‌-14 విభాగంలో జాతీయ పోటీల్లో పాల్గొన్న రాష్ట్ర జట్టు 400 మీటర్ల రిలేలో పోటీపడ్డ బీ విజయ్‌కుమార్‌, టీ అంజికుమార్‌, వై అన్వేష్‌రెడ్డి, ఎస్‌ హర్షవర్ధన్‌ అత్యంత ప్రతిభను కనబర్చి కాంస్య పతకాన్ని సాధించారు. రాష్ట్ర అథ్లెటిక్‌ జట్టుకు కరీంనగర్‌ జిల్లా ఎస్జీఎఫ్‌ కార్యదర్శి కనకం సమ్మయ్య, పెద్దపల్లి జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుడు జావిద్‌లు కోచ్‌, మేనేజర్లుగా వ్యవహరించారు. జాతీయస్థాయిలో కాంస్య పతకం సాధించిన రాష్ట్ర జట్టు క్రీడాకారులను, జిల్లా ఎస్జీఎఫ్‌ కార్యదర్శులను జేసీ శ్యాంప్రసాద్‌లాల్‌, డీఈఓ దుర్గాప్రసాద్‌, అథ్లెటిక్‌ అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు తిరుపతిరావు, నందెల్లి మహిపాల్‌, జిల్లా యువజన క్రీడాశాఖాధికారి జీ అశోక్‌కుమార్‌లు అభినందించారు.

83
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles