సైన్స్‌తో అద్భుతాలు ఆవిష్కృతం

Mon,December 9, 2019 12:27 AM

చొప్పదండి,నమస్తేతెలంగాణ: సైన్స్‌ ఫేర్‌తో అద్భుతాలు ఆవిషృతమవుతాయని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అన్నారు. పట్టణంలోని ఝాన్సీ విద్యాలయంలో మూడురోజులపాటు నిర్వహించే జిల్లా స్థాయి సైన్స్‌ ఫేర్‌ ఏర్పాట్లను ఆదివారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పరిశీలించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యార్థుల్లో దా గి ఉన్న సృజనాత్మకతను నిరూపించుకోవడానికి ఈ వేదిక ఉపయోగపడుతుందని అన్నారు. జిల్లావ్యాప్తంగా విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సోమవారం ప్రారంభంకానున్న సైన్స్‌ ఫేర్‌ కార్యక్రమానికి రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ హాజరుకానున్నారని, నియోజకవర్గ ప్రజాప్రతినిదులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఎమ్మెల్యే వెంట డీఈఓ దుర్గా ప్రసాద్‌, మండల విద్యాధికారి రాజస్వామి, ట్రస్మా నాయకులు పుల్యాల లక్ష్మారెడ్డి, తిప్పర్తి శ్రీనివాస్‌, గుర్రం విష్ణువర్ధన్‌రెడ్డి, కో-ఆప్షన్‌ పాషా, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బందరాపు అజయ్‌, నాయకులు గడ్డం చుక్కారెడ్డి, ఆరెల్లి చంద్రశేఖర్‌, మాచర్ల వినయ్‌, తోట శేషాద్రి, మచ్చరమేశ్‌, వడ్లకొండ శ్రీనివాస్‌, గన్ను శ్రీనివాస్‌రెడ్డి, గోగులకొండ శ్రీనివాస్‌, రాజశేఖర్‌, మహేశ్‌ పాల్గొన్నారు. కాగా సైన్స్‌ఫేర్‌ రిజిస్ట్రేషన్లు ఆదివారం ప్రారంభమయ్యాయి. దాదాపు నాలుగు వందల ఎగ్జిబిట్స్‌ గైడ్‌ టీచర్స్‌తోవచ్చి తమ ఎగ్జిబిట్స్‌ను ప్రదర్శించాలని జిల్లా సైన్స్‌ అధికారి మారం స్వదేశ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం జిల్లాస్థాయి సైన్స్‌ ఫేర్‌ కార్యక్రమాన్ని మంత్రి ఈటల రాజేందర్‌, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, ఎమ్మెల్సీలు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

73
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles