జ్యోతిష్మతి కళాశాలకు అవార్డు

Mon,December 9, 2019 12:27 AM

తిమ్మాపూర్‌, నమస్తే తెలంగాణ: మండలంలోని జ్యోతిష్మతి ఇంజినీరింగ్‌ కళాశాలకు బ్రెయిన్‌ ఫీడ్‌ హయర్‌ ఎడ్యుకేషన్‌-2019 అవార్డు లభించినట్లు విద్యాసంస్థల చైర్మన్‌ జువ్వాడి సాగర్‌రావు తెలిపారు. బ్రెయిన్‌ ఫీడ్‌ సంస్థ తన 7వ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ను హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీచింగ్‌ అండ్‌ లర్నింగ్‌లో నూతన ఆవిష్కరణలు అత్యుత్తమ స్థాయిలో ప్రదర్శించి, విద్యార్థులకు అత్యుత్తమ నైపుణ్య విద్యనందించి, వారిని కెరీర్‌లో విజయ శిఖరాలకు చేరేందుకు కృషి చేసినందుకు గాను కళాశాలకు ఈ అవార్డు లభించినట్లు తెలిపారు. ఈ అవార్డును రాష్ట్ర ఎడ్యుకేషన్‌ డిపార్టుమెంట్‌ కార్యదర్శి డాక్టర్‌ బీ జనార్దన్‌రెడ్డి, మాజీ సీబీఐ జేడీ వీవీ లక్ష్మీనారాయణ, తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్‌ ఆఫ్‌ హయర్‌ ఎడ్యుకేషన్‌ చైర్మన్‌ పాపిరెడ్డి, హైదరాబాద్‌ యూనివర్శీటీ వీసీ అప్పారావుల సమక్షంలో కళాశాల తరపు నుంచి కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ అధ్యాపకుడు డాక్టర్‌ దావ శ్రీనివాస్‌ అందుకున్నట్లు తెలిపారు. జ్యోతిష్మతికి ఈ అవార్డు రావడంపై కళాశాల చైర్మన్‌ జువ్వాడి సాగర్‌రావు, సెక్రటరీ జువ్వాడి సుమిత్‌సాయి, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జీ లక్ష్మీనారాయణరావు, డీన్‌ అకాడమిక్స్‌ ఎస్‌వీఎస్‌ రామకృష్ణంరాజులు హర్షం వ్యక్తం చేశారు.

72
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles