జాతీయ కరాటే పోటీలకు ఏర్పాట్లు పూర్తి

Sun,December 8, 2019 02:42 AM

కరీంనగర్ స్పోర్ట్: జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం జరిగే జాతీయ ఓపెన్ టు ఆల్ స్టెల్స్ మార్షల్ ఆర్ట్ కుంగ్‌ఫూ, కరాటే చాంపియన్‌షిప్-2019 పోటీలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పోటీల నిర్వాహక కమిటీ చైర్మన్ గసిడ్డి జనార్దన్‌డ్డి, కన్వీనర్ కోడూరి శేఖర్‌లు తెలిపారు. శనివారం పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను వారు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఇంటర్నేషనల్ షావోలిన్ కుంగ్‌ఫూ బ్రూస్ మార్షల్ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో తొలిసారిగా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరుకానున్నారనీ, క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. తెలంగాణ, ఆంధ్రవూపదేశ్, తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల నుంచి సుమారు 600 మంది క్రీడాకారులు 100 మంది ఇన్‌స్ట్రక్టర్‌లు, కోచ్‌లు, మేనేజర్‌లు, టెక్నికల్ అధికారులు హాజరుకానున్నట్లు తెలిపారు. అండర్-10, 12, 14, 16, 18 ఓపెన్ విభాగాల్లో బాల బాలికలకు వేర్వేరుగా బరువు ఆధారంగా కటాస్, స్పారింగ్, టీమ్ కటాస్, వెపన్ కటాస్, గ్రాండ్ చాంపియన్‌షిప్స్‌లలో పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్ ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభిస్తారని చెప్పారు. ఈ కార్యక్షికమంలో జిల్లా ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్‌డ్డి, కరాటే, కుంగ్‌ఫూ ఇన్‌స్ట్రక్టర్‌లు, మాస్టర్‌లు లింగమూర్తి, బార విద్యాసాగర్, మొయిన్, ఎలగందుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

78
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles