ఫిర్యాదులపై స్పందించండి

Sun,December 8, 2019 02:42 AM

టవర్‌సర్కిల్: జిల్లావ్యాప్తంగా మీ సేవ ద్వారా వచ్చిన ఫిర్యాదులపై స్పందించి త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ జీవీ శ్యామ్ ప్రసాద్‌లాల్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశమందిరంలో భూ సర్వే, రికార్డులు, క ల్యాణలక్ష్మి తదితర అంశాలపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రోజువారీగా వచ్చిన సమస్యలను పరిష్కరించి పెండింగ్ లేకుం డా చూడాలని పేర్కొన్నారు. ప్రభుత్వ, అసైన్డ్ భూములు మిగిలిన భూ సర్వేలను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాలవారీగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ సంబంధించి ఏ ఫైల్ కూడా పెండింగ్ లేకుండా వెంటవెంటనే పరిష్కరించాలన్నారు. రెండో వివాహ లబ్ధిదారులకు కూడా మొదటి వివాహంలో లబ్ధి పొందలేకపోతే కల్యాణలక్ష్మి వర్తిస్తుందని వివరించారు. అదేవిధంగా పెళ్లి కూతురుకు తల్లి లేకపోతే అ అమ్మాయి పేరు మీదే చెక్కు ఇవ్వాలని సూచించారు. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న సర్వే వివరాలను తెలుసుకున్నారు. ఇకపై పెండింగ్ పనులను ఉపేక్షించేది లేదన్నారు. అధికారులు రైతులతో సవినయంగా ఉండాలని సూచించారు. కార్యక్షికమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి ఆనంద్‌కుమార్, జిల్లాలోని తాసిల్దార్లు పాల్గొన్నారు.

61
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles