15న అల్ఫోర్స్ మ్యాథ్స్ ఒలింపియాడ్ టెస్ట్

Sun,December 8, 2019 02:42 AM

ముకరంపుర: శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న మ్యాథ్స్ ఒలింపియాడ్ టెస్ట్‌ను ఈనెల15న మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు నిర్వహించడానికి అన్ని ఏర్పా ట్లు పూర్తి చేసినట్లు అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్‌డ్డి తెలిపారు. శనివారం వావిలాలపల్లి అల్ఫోర్స్ ఈ టెక్నో కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. గణితశాస్త్రం చాలా కీలకమైందని, పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించేందుకు చేయూతనందిస్తుందన్నారు. నేటి పోటీ ప్రపంచంలో గణితశాస్త్రానికి ప్రత్యేకమైన స్థానం ఉందని, విద్యార్థులకు చాలా విషయాలు నేర్పుతుందని, తద్వారా నూతన ఆవిష్కరణలకు ఆస్కారం ఉంటుందని వివరించారు. గణిత పితామహుడు శ్రీనివాస రామానుజన్ కృషిని ప్రతి ఒక్క విద్యార్థి విధిగా తెలుసుకోవాలన్నారు. 6,7,8,9,10వ తరగతి విద్యార్థులకు గణితశాస్త్రానికి సంబంధించిన పరీక్షను నిర్వహించి వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికతీయడంలో సఫలీకృతం అవుతున్నామన్నారు. ఈ పరీక్షలో మొదటి 3 స్థానాల్లో నిలిచిన 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఈనెల 22న నిర్వహించబోయే జాతీయ గణిత దినోత్సవ, శ్రీనివాస రామానుజన్ జయం తి వేడుకల్లో ముఖ్యఅతిథుల చేతుల మీదుగా ప్రశంశాపత్రాలతోపాటు నగదు బహుమతులను ప్రదానం చేసి సన్మానిస్తామన్నారు. పరీక్ష రాసే విద్యార్థులు ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని, కేవలం పెన్ను, ప్యాడ్, పాఠశాల ధ్రువీకరణ పత్రం మాత్రమే తెచ్చుకోవాలని కోరా రు. వివిధ తరగతుల్లో మొదటి 20ర్యాంకర్లకు ప్రశంసా పత్రాలు అందిస్తామని వివరించారు. మరిన్ని వివరాలకు 9246734447, 9398230617, 9246934441లో సంప్రదించవచ్చని చెప్పారు. ఇందులో వివిధ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

128
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles