కుటుంబాలకు కొండంత అండ

Sat,December 7, 2019 02:43 AM

-ఇచ్చిన గడువుకంటే ముందే ఇద్దరికి ఆర్టీసీ ఉద్యోగాలు
-ఇంటికి వెళ్లి మరీ ఉత్తర్వులు ఇచ్చిన మంత్రి గంగుల
-మృతుల కుటుంబాలకు ₹2 లక్షల ఎక్స్‌గ్రేషియా
-టీఆర్‌ఎస్ పార్టీ పక్షాన ₹50 వేల చొప్పున ఇస్తామని హామీ
-మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్
(కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ)
ఆర్టీసీ సమ్మె కాలంలో మరణించిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారు. ఈ మేరకు కరీంనగర్-1, 2 డిపోల్లో పనిచేస్తూ గుండె పోటుతో మరణించిన ఇద్దరు ఉద్యోగుల కుటుంబాల్లో ఒక్కొక్కరికి జూనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగాలు ఇస్తూ ఆర్టీసీ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. శుక్రవారం మంత్రి గంగుల కమలాకర్, ఆర్‌ఎం జీవన్‌వూపసాద్ స్వయంగా వారి ఇంటికి వెళ్లి నియామక ఉత్తర్వులు, ప్రభుత్వం ప్రకటించిన రూ.2 లక్షల ఎక్స్‌క్షిగేషియా చెక్కులను అందించారు. అంతేకాకుండా మృతుల కుటుంబాలకు టీఆర్‌ఎస్ పక్షాన రూ.50 వేల చొప్పున ఆర్థికసాయం అందిస్తామని మంత్రి గంగుల ప్రకటించడంతో ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి
యూనియన్ల మాట విని ఆర్టీసీ ఉద్యోగులు సుదీర్ఘ కాలం చేసిన సమ్మె కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కొందరు ఆత్మహత్యలు చేసుకోగా, మరి కొందరు గుండె పోటుతో మరణించారు. కరీంనగర్ రీజియన్ పరిధిలో కరీంనగర్-1 డిపోకు చెందిన మెకానిక్ మహ్మద్ ఖరీం గత నెల 6న గుండె పోటుతో మృతి చెందారు. దీంతో కరీంనగర్ శివారులోని తీగలగుట్టపల్లికి చెందిన ఇతని కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలో పడింది.

సమ్మె ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం కరీం కుమారుడు అసద్‌ఖాన్‌కు కరీంనగర్-1 డిపోలనే జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇచ్చారు. కరీంకు తల్లి, భార్య, ముగ్గురు పిల్లలు ఉండగా, బీటెక్ వరకు చదువుకున్న పెద్ద కొడుకు అసద్‌ఖాన్‌కు ఉద్యోగం ఇచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకున్నారు. శుక్రవారం ఉత్తర్వులు అందుకున్న అసద్‌ఖాన్ కరీంనగర్-1 డిపో మేనేజర్ ఉప్పర అర్పితకు తన జాయినింగ్ లెటర్ కూడా అందించారు.

బాబు కుటుంబానికి సర్కారు బాసట
కరీంనగర్ -2 డిపోలో డ్రైవర్‌గా పనిచేసే నంగునూరి బాబు నిరుపేద కుటుంబానికి చెందిన వాడు. సమ్మెలో భాగంగా అక్టోబర్ 30న హైదరాబాద్‌లో ఆర్టీసీ ఉద్యోగులు నిర్వహించిన సకల జనుల సదస్సుకు హాజరై అక్కడే గుండె పోటుకు గురై మరణించాడు. ఇతని మరణంతో నిరుపేద కుటుంబం ఆగమైంది. అయితే ఇతని శవంతో కొందరు నాయకులురాజకీయం చేశారు. రెండు రోజుల పాటు శవాన్ని ఇంటి ముందు వేసి ఆర్టీసీ సమ్మెకు పరిష్కారం చూపితేనే దహన క్రియలు చేపడుతామని కుటుంబ సభ్యులను తప్పుదోవ పట్టించారు. శవరాజకీయాలను గ్రహించిన బాబు కుటుంబ సభ్యులు రెండు రోజుల తర్వాత అంతిమ సంస్కారాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత కూడా విపక్షాలు, కొందరు నాయకుల వైఖరిలో మార్పు రాలేదు. రాజకీయం చేయడమే పరమావదిగా పెట్టుకున్న సదరు నాయకులు బాబు కుటుంబ పరిస్థితులను మాత్రం ఆలోచించలేదు. కేవలం తమ ప్రచారం కోసం వాడుకుని వదిలేశారని బాబు నివాసం ఉండే ఆరెపల్లి వాసులు అప్పట్లోనే విమర్శలు చేశారు. కానీ, ప్రభుత్వం మాత్రం వారిని వదిలేయ లేదు. బాబు కొడుకు సాయికిరణ్‌కు ఆయన పనిచేసిన కరీంనగర్ -2 డిపోలోనే జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇచ్చి ఆదుకున్నది. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఈ కుటుంబానికి కూడా ఉద్యోగంతోపాటు రూ.2 లక్షల ఎక్స్‌క్షిగేషియా ఇచ్చి బాసటగా నిలిచారు.

ఔదార్యం చూపిన మంత్రి గంగుల
ఆర్టీసీ సమ్మె కాలంలో బాబు శవాన్నే కాదు ఎక్కడ టెంట్ ఉంటే అక్కడికి వెళ్లి నానా హంగామా చేసిన విపక్షాలు ఆ తర్వాత ఎవరినీ పట్టించుకోలేదు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో ఉన్నపుడు వారి స్థితిగతుల గురించి ఏ మాత్రమూ పట్టించుకోకుండా వారి రాజకీయ పబ్బానికి వాడుకునే ప్రయత్నం చేశారనే విమర్శలు అప్పట్లో వెల్లు ప్రత్యేకించి బాబు శవాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేసిన నాయకుపూవరూ ఆ తర్వాత ఆకుటుంబం గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గుండె పోటుతో మరణించిన బాబు, కరీం కుటుంబాల పట్ల ఔదార్యం చూపారు. వారి కుటుంబాల్లో ఒకరికి ఆర్టీసీలో ఉద్యోగం ఇవ్వడంతోపాటు ప్రభుత్వం ఇస్తున్న రూ.2 లక్షల ఎక్స్‌క్షిగేషియా కూడా అందించారు. అంతే కాకుండా టీఆర్‌ఎస్ పక్షాన రూ.50 వేల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. శవాలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేసే ప్రయత్నం చేసిన విపక్షాలకు, మరణించిన వారి కుటుంబాల ఆర్థిక స్థితిగతులు తెలుసుకుని ఆర్థికసాయం అందించేందుకు ముందుకు వచ్చిన మంత్రి గంగులకు ఉన్న వ్యత్యాసం గురించి ఉద్యోగులు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు.

గడువు కాక ముందే ఉద్యోగాలు..
ఈ నెల 1న ప్రగతి భవన్‌లో జరిగిన ఆత్మీయ సమావేశంలో సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులపై వరాల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా సమ్మె కాలంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వారిలో ఒకరికి రోజుల్లోనే ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో రూ.2 లక్షల ఎక్స్‌క్షిగేషియా కూడా ఇవ్వాలని చెప్పారు. ఈ సమావేశం జరిగి శుక్రవారం నాటికి ఐదు రోజులు మాత్రమే అవుతోంది. సీఎం కేసీఆర్ ఇచ్చిన గడువుకు ముందే కరీంనగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో ఇద్దరికి ఉద్యోగం, ఎక్స్‌క్షిగేషియా ఇవ్వడంపట్ల ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

92
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles