కేసీఆర్ మానవతావాది

Sat,December 7, 2019 02:38 AM

-ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను ఆదుకోవడంతో మరోసారి రుజువైంది
-ప్రతిపక్షాలు శవజాగరణతో సాధించిందేమిటి?
-రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్ రూరల్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మనవతావాదనీ, ఆర్టీసీ సమ్మె సమయంలో మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవడమే దీనికి మరో నిదర్శనమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. కరీంనగర్ మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన కరీంనగర్ ఆర్టీసీ డిపో-2 డ్రైవర్ నంగునూరి బాబు, తీగలగుట్లపల్లికి చెందిన కరీంనగర్ ఆర్టీసీ డిపో-1 మెకానిక్ కరీం ఖాన్ సమ్మె సమయంలో మృతిచెందగా, శుక్రవారం వారి కుటుంబ సభ్యులకు పరిహారం, ఆర్థిక సాయంతోపాటు ఆర్టీసీలో ఉద్యోగ నియామక పత్రాలను అందించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉన్నారనీ, ఎవరూ అడగకముందే వారి కుటుంబాలకు పరిహారంగా రూ.2 లక్షలు, టీఆర్‌ఎస్ పార్టీ పక్షాన రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారని తెలిపారు. ఉద్యోగాలూ కల్పించారని చెప్పారు. ఆ రోజు పెద్దపెద్ద నాయకులు.. పెద్దపెద్ద జెండాలు పట్టుకొని వచ్చి బాబు కుటుంబానికి ఏం న్యాయం చేశారని విపక్షాలను మంత్రి ప్రశ్నించారు. వారి కుటుంబ సభ్యుల అమాయకత్వంతో శవ జాగరణ చేశారనీ, రాజకీయ వేదికగా ఉపయోగించుకున్నారని విమర్శించారు. నిరుపేదైన బాబు కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు కోసం ఆర్డీవో ప్రభుత్వానికి నివేదిక అందించారనీ, త్వరలోనే కేటాయిస్తామని తెలిపారు. ఈ కార్యక్షికమంలో ఆర్టీసీ ఆర్‌ఎం జీవన్‌వూపసాద్, ఆర్టీసీ డిపో మేనేజరు మల్లేశం, టీఆర్‌ఎస్ నాయకులు కాశెట్టి శ్రీనివాస్, తుల బాలయ్య, మూల రవీందర్‌డ్డి, కొమ్ము భూమయ్య, సుంకిశాల సంపత్‌రావు, సూరి, బండారి వేణు, హరిశంకర్, గంగిపెల్లి వెంక ఎంపీటీసీ అంకమల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.


సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం..
మా నాన్న చనిపోయిన నెల రోజుల్లో నాకు ఉద్యోగం వస్తదని అనుకోలేదు. ఇంత మంచి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. సమ్మె కాలంలో మా నాన్న చనిపోయాడని, కొందరు ఉద్యోగం వస్తుందో లేదో అన్నారు. డ్యూటీలో చనిపోతేనే ఉద్యోగం వస్తదని ఇంకొందరు అన్నారు. కానీ, సీఎం కేసీఆర్ సార్ ఇవ్వన్నీ ఏమీ పట్టించుకోకుండా నాకు జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇచ్చారు. వీధిన పడుతుంది అనుకున్న మా కుటుంబాన్ని ఆదుకున్నారు. సారు రుణం జన్మలో తీర్చుకోలేం. నాలాగే ఎంతో మందిని ఇప్పుడు కేసీఆర్ సార్ దేవుడిలా ఆదుకుంటున్నారు. మాలాంటి ఎన్నో కుటుంబాలు ఇప్పుడు సంతోషంగా ఉంటాయి.

64
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles