గ్రీన్‌చాలెంజ్‌కు ప్రముఖుల స్పందన

Sat,December 7, 2019 02:36 AM

టవర్‌సర్కిల్: రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ పిలుపు మేరకు ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలోని కేంద్ర గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు ఏనుగు రవీందర్‌డ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విసిరిన గ్రీన్‌చాపూంజ్‌ను స్వీకరించి సంతోష్‌కుమార్ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్షికమం చేపట్టామన్నారు. టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర నాయకులు జక్కుల నాగరాజు, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు ఎండీ ఫహాద్, నాయకులు సంగు వేణు, సాయి, నవీన్‌డ్డి, సందమల్ల రవితేజ వర్మ, సుదర్శన్, వెంకట్‌డ్డి పాల్గొన్నారు.


తిమ్మాపూర్, నమస్తే తెలంగాణ : గ్రీన్‌చాపూంజ్‌లో భాగంగా శుక్రవారం మండలంలోని జ్యోతిష్మతి కళాశాల ఆవరణలో జ్యోతిష్మతి గ్రూప్ విద్యాసంస్థల చైర్మన్ జువ్వాడి సాగర్‌రావు మొక్క నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మొక్క నాటామన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీ లక్ష్మీనారాయణరావు, అకాడమిక్స్ డీన్ డాక్టర్ ఎస్‌వీఎస్ రామకృష్ణంరాజు, కళాశాల హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంట్స్, అధ్యాపకులు, విద్యార్థులకు గ్రీన్‌చాపూంజ్ విసిరారు.


రామడుగు: తన బాల్య మిత్రుడు, టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు జోగినపల్లి అజిత్‌కుమార్ విసిరిన గ్రీన్‌చాపూంజ్‌ను టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంక స్వీకరించారు. ఈ మేరకు శుక్రవారం రామడుగు మండలం వెలిచాల గ్రామంలో మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వెంక మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ పుట్టినరోజు పురస్కరించుకొని గ్రీన్‌చాపూంజ్‌లో భాగంగా నేడు భారీ సంఖ్యలో మొక్కలు నాటాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల శ్రావణ్, టీఆర్‌ఎస్ ఎల్పీ సెక్రటరీ మాదాడి రమేశ్‌డ్డి, పార్టీ నాయకుడు, వ్యాపారవేత్త మిర్యాల సత్యచరణ్‌రావులకు వెంక గ్రీన్‌చాపూంజ్ విసిరారు.

76
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles