డివిజన్ల మార్పులపై కసరత్తు

Sat,December 7, 2019 02:36 AM
-వెల్లువెత్తుతున్న అభ్యంతరాలు
-పరిశీలనపై దృష్టిపెట్టిన అధికారులు

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: కరీంనగర్‌లో చేపడుతున్న డివిజన్ల పునర్విభజనలో మార్పులు చేర్పులకు అధికారులు కసరత్తు చేపడుతున్నారు. హైకోర్టు ఆదేశాలతో ఇప్పటికే డివిజన్ల పునర్విభజనకు సంబంధించి ముసాయిదా జాబితాను విడుదల చేశారు. వీటిపై ఈ నెల 9 వరకు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు.

కాగా, రెండు రోజుల్లోనే 25 మేరకు అభ్యంతరాలు రాగా.. రాబోయే రోజుల్లో మరిన్ని అభ్యంతరాలు రానున్నాయి. గత జూలైలో చేపట్టిన పునర్విభజన కార్యక్షికమంలో 70కి పైగా అభ్యంతరాలు రాగా, ఈ సారి అంతకు మించి అభ్యంతరాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో వచ్చిన దరఖాస్తులపై ఇప్పటి నుంచే అధికారులు దృష్టి పెడుతున్నట్లు తెలుస్తున్నది. వచ్చిన అభ్యంతరాలవారీగా ఏయే డివిజన్ల నుంచి వస్తున్నాయి? ఎలాంటివి వస్తున్నాయి? వాటిలో ఏ మేరకు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది? అన్న వాటిని పరిశీలిస్తున్న అధికారులు అందుకనుగుణంగా చర్యలు చేపడుతున్నారు.

మార్పులకు అవకాశం..
అధికారులు ప్రకటించిన ముసాయిదా జాబితాల్లో భారీగానే మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉందన్న ప్రచారం జోరందుకున్నది. ముఖ్యంగా పలు డివిజన్లలో అధికారులు పేర్కొన్న ఇంటి నంబర్ల ప్రకారం చూస్తే కొన్ని డివిజన్లలో ఓటర్ల సంఖ్య సరాసరికి తక్కువగా, కొన్నింటిల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఆయా డివిజన్ల సరిహద్దుల మార్పు జరుగుతుందని ఆశావహులు అంచనాలు వేస్తున్నారు.

వీటి వల్ల అన్ని డివిజన్లలోనూ ఆ స్థాయిలోనే మార్పులు, చేర్పులు జరుగుతాయని లెక్కలు వేస్తున్నారు. పలు డివిజన్లకు సంబంధించి పక్కన ఉన్న ఏరియాను విడిచిపెట్టి దూరంలో ఉన్న ఏరియాలను కలిపారన్న అభ్యంతరాలు వ్యకమవుతున్నాయి. వీటన్నింటిని సవరిస్తే భారీగా మార్పులు వచ్చే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు ఆయా డివిజన్లలో ఓటర్ల సంఖ్యలో ఇప్పటి నుంచే ఆశావహులు లెక్కలు వేస్తున్నారు. ఆయా డివిజన్లలో ఎంత మంది ఓటర్లు వస్తారు? ఏ మేరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్లు కూడా ఉంటారన్న విషయంలో అంచనాలు సిద్ధం చేసుకుంటున్నారు.

88
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles