ఆడబిడ్డలకు సర్కారు అండ

Fri,December 6, 2019 02:25 AM

చొప్పదండి, నమస్తే తెలంగాణ: నిరుపేద ఆడపిల్లల కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టి, అమలుచేస్తున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్వార్టర్‌ కార్యాలయంలో మండలంలోని 36 మంది లబ్ధిదారులకు ఆయన రూ.36 లక్షల 4 వేల 176 విలువగల కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ మాట్లాడుతూ, గతంలో ఆడపిల్లల పెళ్లిల్లు చేసేందుకు నిరుపేద కుటుంబాలకు చెందినవారు తీవ్ర అవస్థలు పడేవారన్నారు. కానీ, తెలంగాణ సర్కారు ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో కొంత భరోసా లభించిందన్నారు. మహిళా సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి, అమలుచేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, స్థానిక ఎంపీపీ చిలుక రవి, సర్పంచులు గుంట రవి, లావణ్య, పెద్ది శంకర్‌, సౌజన్య, రామక్రిష్ణ, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బందారపు అజయ్‌, నాయకులు ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్‌, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, మాచర్ల వినయ్‌, గొల్లపల్లి శ్రావణ్‌, బత్తిని సంపత్‌, చేపూరి రవి, రాపెల్లి ఐలయ్య, గంగయ్య, చేపూరి రవి, డేవిడ్‌, దండె క్రిష్ణ, మహేశ్‌, లంకర లక్ష్మణ్‌, రాజశేఖర్‌ పాల్గొన్నారు.

88
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles