సబ్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలకు స్పందన

Fri,December 6, 2019 02:25 AM

కరీంనగర్‌ స్పోర్ట్స్‌: జిల్లా కేంద్రంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌స్టేడియంలో గురువారం నిర్వహించిన సబ్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలకు విశేష స్పందన లభించిందని జిల్లా ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు, అథ్లెటిక్స్‌ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మహిపాల్‌, తిరుపతిరావు పేర్కొన్నారు. అండర్‌-8, 10, 11, 12 బాల బాలికల విభాగంలో నిర్వహించిన జిల్లాస్థాయి ఎంపిక పోటీల్లో హుజూరాబాద్‌, జమ్మికుంట, కొత్తపెల్లి, జంగపెల్లి, కన్నాపూర్‌, చొప్పదండి, తిమ్మాపూర్‌, శంకరపట్నం, గుండ్లపల్లి, మాదాపూర్‌, కొండాపూర్‌, తదితర ప్రాంతాల నుంచి సుమారు 259 మంది బాల బాలికలు ఈ పోటీల్లో పాల్గొన్నారన్నారు. త్రోస్‌, జంప్స్‌, రన్నింగ్‌ విభాగంలో నిర్వహించిన పోటీల్లో సత్తాచాటిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు.

70
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles