ఫిర్యాదులపై సత్వరం స్పందించాలి

Fri,December 6, 2019 02:25 AM

కరీంనగర్‌ క్రైం: బ్లూకోల్ట్స్‌, పెట్రోలింగ్‌ విభాగాలకు చెందిన పోలీసులు ఫిర్యాదులు అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సేవలందించాలని సీపీ కమలాసన్‌రెడ్డి సూచించారు. గురువారం కమిషనరేట్‌ కేంద్రంలో బ్లూకోల్ట్స్‌, పెట్రోలింగ్‌ విభాగాలకు చెందిన పోలీసులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలనీ, ఇందుకోసం పటిష్టమైన సమాచార వ్యవస్థ రూపొందించుకోవాలని ఆదేశించారు. టెక్నాలజీ వినియోగంతో ముందుకు సాగాలన్నారు. అర్ధరాత్రి రోడ్లపై వేడుకలు నిర్వహించడం, మారణాయుధాలు ధరించడం, అర్ధరాత్రి వరకు దుకాణాలు తెరిచి ఉంచడం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడంపై ఈ పెట్టి కేసులు నమోదు చేయాలని సూచించారు. గస్తీ తిరుగుతున్న ప్రాంతాలకు చెందిన ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలనీ, సమర్థ సేవలందించే వారికి ప్రోత్సాహకాలు అందజేస్తామని తెలిపారు. ఎక్కువగా నేరాలు, ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి గస్తీ ముమ్మరం చేయాలని సూచించారు. డీసీపీ శ్రీనివాస్‌, ఇన్‌స్పెక్టర్లు విజయ్‌కుమార్‌, రమేశ్‌, ఆర్‌ఎస్‌ఐ మురళి పాల్గొన్నారు.

68
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles