ఒక్కటైన ప్రేమజంట

Fri,December 6, 2019 02:25 AM

-వివాహం చేసుకున్న మరుగుజ్జులు
ముకరంపుర: కరీంనగర్‌ కిసాన్‌నగర్‌కు చెందిన మరుగుజ్జు సగెం అరుణ్‌ కుమార్‌, సికింద్రాబాద్‌కు చెందిన రవళి అనే మరుగుజ్జు యువతిని వివాహమాడి ఆదర్శంగా నిలిచారు. వీరి వివాహం గురువారం కరీంనగర్‌లో వైభవంగా జరిగింది. ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకొని ఒక్కటయ్యారు. అరుణ్‌కుమార్‌ తెలంగాణ ఉద్యమంలో ఇంజినీరింగ్‌ స్టూడెంట్‌ జేఏసీ జిల్లా చైర్మన్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం జేఎన్టీయూలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు వారి స్నేహితులు పేర్కొన్నారు. రవళి హైద రాబాద్‌లోని ఓ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్నది. వారిని బంధుమిత్రులు, ప్రముఖులు, పలువురు ఆశీర్వదించారు.

77
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles