లక్ష్యం మేరకు పని కల్పించాలి

Thu,December 5, 2019 02:57 AM

గంగాధర: ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి కూలికి 100 రోజుల పని కల్పించాలని ఏపీడీ మంజులాదేవి ఆదేశించారు. స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో బుధవారం ఉపాధిహామీ, హరితహారం, పల్లెప్రగతి పనులపై క్షేత్ర సహాయకులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీడీ మాట్లాడుతూ ప్రతి కూలీకి 100 రోజుల పని కల్పించడంతో పాటు రూ. 211 కూలీ వచ్చేలా చూడాలన్నారు. ప్రతి గ్రామంలో ఆధునిక వైకుంఠధామం, డంపుయార్డుల నిర్మాణం చేపట్టాలనీ, ఇంటింటా ఇంకుడు గుంత నిర్మించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

వర్షపు నీటిని ఒడిసి పట్టడానికి రూఫ్‌వాటర్‌ హార్వెస్టింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీల వద్ద నీటిని పొదుపు చేసే నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు చనిపోతే కొత్త మొక్కలు నాటాలన్నారు. ఈ సమావేశంలో ఏపీవో రాణి, తదితరులు పాల్గొన్నారు.

రామడుగు: గ్రామాల్లో ప్రతి కూలీకి వందరోజులు పని కల్పించాలని ఏపీడీ మంజులాదేవి ఆదేశించారు. మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీడీ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో శ్రమశక్తి సంఘం సభ్యులందరికీ పని కల్పించాలన్నారు.

ప్రతినెల లక్ష్యాన్ని చేరుకునేలా పనులు చేపట్టాలన్నారు. ప్రతికూలీ కొలతల ప్రకారం పని చేసేలా చూడాలనీ, కూలి రూ. 211 గిట్టుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో డంప్‌యార్డు, శ్మశానవాటికల నిర్మాణాలు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. గ్రామాల్లో ఇంటింటా ఇంకుడుగుంత నిర్మించుకునేలా చూడాలన్నారు. ప్రగతిలో ఉన్న వాటిని పూర్తి చేయాలన్నారు. చేతిపంపులు, బోర్ల వద్ద రీచార్జి గుంతలు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగేలా పాంపాండ్లు, ఫిష్‌పాండ్‌, తదితర నిర్మాణాలు చేపట్టాలన్నారు. ప్రతి గ్రామంలో విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కలిగేటి కవిత, ఎంపీడీవో సతీష్‌రావు, ఏపీవో చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

62
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles