మనసున్న మారాజు ముఖ్యమంత్రి కేసీఆర్‌

Thu,December 5, 2019 02:56 AM

-నిరుపేద ఆడబిడ్డలకు భరోసా
-చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌
-80 మంది లబ్ధిదారులక కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల అందజేత

రామడుగు: మనసున్న మారాజు మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని, పేదింటి బిడ్డల పెండ్లికి పెద్దమనస్సుతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు తీసుకువచ్చారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం మండల కేంద్రంలోని మండల పరిషత్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. మండలంలోని 11గ్రామాలకు చెందిన 80 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులకు 90 లక్షల 10వేల 440 రూపాయల విలువైన చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఊరూరు తిరుగుతుండగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఓ గ్రామంలో ఓ నిరుపేద తండ్రి పరిస్థితి చూసి చలించిన కేసీఆర్‌.. ఆయన బిడ్డ పెళ్లికి సాయం అందించారనీ, అనంతరం తెలంగాణ రాష్ట్రంలో ఏ పేద కుటుంబం ఇబ్బంది పడవద్దని కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు రూపొందించారని గుర్తుచేశారు. ఈ పథకం కింద మొదట 50 వేల సాయం అందించిన ప్రభుత్వం, తరువాత ఆ మొత్తాన్ని 75వేలకు పెంచిందనీ, ప్రస్తుతం లక్షా నూటపదహార్లను అందిస్తూ పేద కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నదని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 60ఏండ్లకు పైగా ఏలిన పాలకులు నిరుపేద బిడ్డల వివాహాలకు నయాపైసా కూడా విదల్చలేదన్నారు. ఆడపిల్ల పుట్టిందంటే ఇంటిల్లిపాదీ బాధపడిన రోజులు ఆనాటివనీ, ఆడబిడ్డ పుట్టిందంటే ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందని నేటి తల్లిదండ్రులు ఆనందపడుతున్నారని పేర్కొన్నారు.

ప్రస్తుతం రామడుగు మండలానికి కోటి రూపాయల కల్యాణలక్ష్మి చెక్కులు వచ్చామని తెలిపారు. మరో పదిరోజుల్లో మరో కోటి రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందిస్తామన్నారు. ప్రతి పేదింటి బిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మి చేయూతనందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కలిగేటి కవిత, జడ్పీటీసీ మార్కొండ లక్ష్మి, తాసిల్దార్‌ కోమల్‌రెడ్డి, ఎంపీడీవో సతీశ్‌రావు, సర్పంచ్‌ పంజాల ప్రమీల, ఎంపీటీసీ బొమ్మరవేని తిరుమల, వైస్‌ ఎంపీపీ గోపాల్‌, ఏఎంసీ చైర్మన్‌ గంట్ల వెంకటరెడ్డి, విండో చైర్మన్‌ ఒంటెల మురళీకృష్ణారెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.

78
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles