ఇక పురపోరు

Wed,December 4, 2019 02:08 AM

-బల్దియాల వారీగా విడుదల
-నేడు పత్రికల్లో ముసాయిదా
-9 వరకు అభ్యంతరాల స్వీకరణ
-16 వరకు పరిశీలన
-17న తుది జాబితా
-ఏర్పాట్లలో అధికారులు


కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: మున్సిపల్ ఎన్నికలకు అన్ని అడ్డంకులూ తొలగిపోయాయి. ఇప్పటికే అన్ని మున్సిపాలిటీల్లో డివిజన్లు, వార్డుల విభజన, ఓటర్ల జాబితా, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితాలు ప్రకటించగా, కొందరు వీటిపై ఉన్న అభ్యంతరాలతో హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ మేరకు వీరి అభ్యంతరాలను పరిశీలించేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

దీంతో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంగళవారం కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం చర్యలు చేప అధికారులు సిద్ధమయ్యారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని రెండు నగరపాలక సంస్థలు, 14 మున్సిపాలిటీల్లో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు బుధవారం అన్ని పత్రికల్లో డివిజన్లు, వార్డులకు సంబంధించిన జాబితాలను ప్రకటిస్తారు. వీటిపై ఈ నెల9న సాయంత్రం 5 గంటల వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. వచ్చిన అభ్యంతరాలపై ఈ నెల 16 వరకు ఏడు రోజుల పాటు పరిశీలించి అభ్యంతరాలను పరిష్కరిస్తారు. ఈ నెల 17 తుది జాబితాను సిద్ధం చేసి రాష్ట్ర మున్సిపల్ శాఖకు పంపించడంతో పాటు ప్రకటిస్తారు.


అభ్యంతరాలు సిద్ధం చేసుకుంటున్న నేతలు
కాగా, తమ డివిజన్లు, వార్డుల్లో ఓటర్ల సంఖ్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితా విషయంలో పలువురు నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గత జూలైలో ప్రకటించిన తుది జాబితానే ఇప్పుడు కూడా అధికారులు ప్రకటిస్తున్నారు. ఈ జాబితాల్లో ఉన్న వాటిపై నాయకులు, ప్రజలు తమ అభ్యంతరాలు, సలహాలను బుధవారం నుంచి మున్సిపాలిటీల్లో అందించవచ్చు.

కరీంనగర్ నగరపాలక సంస్థలో ఇద్దరు నాయకులు తమ అభ్యంతరాలను పరిశీలించాలంటూ గతంలో కోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. కాగా, ఇప్పుడు ఈ నాయకులు పూర్తి వివరాలతో తమ అభ్యంతరాలను తెలుపుతూ వినతిపవూతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరితోపాటు పలు డివిజన్ల నాయకులు, నేతలు సైతం అభ్యంతరాలు అందించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాగా, ఈ సారి కరీంనగర్ నగరపాలక సంస్థకు వివిధ డివిజన్ల నుంచి పెద్ద సంఖ్యలోనే అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉన్నది. అభ్యంతరాలను పరిష్కరించేందుకు ఏడు రోజులు సమయం ఇవ్వడంతో పూర్తిస్థాయిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు వీలు ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

73
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles