దివ్యాంగుల సంక్షేమానికి కృషి

Wed,December 4, 2019 02:07 AM

-ఆత్మస్థైర్యంతో ముందుకుసాగాలి
-సమాజంలో ఉన్నతంగా ఎదగాలి
-జడ్పీ అధ్యక్షురాలు విజయ, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
-కలెక్టరేట్‌లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం

సుభాష్‌నగర్: తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తున్నదనీ, ఇందులో భాగంగా అనేక పథకాల ద్వారా చేయూతనందిస్తున్నదని జడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా సంక్షేమ శాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, మెప్మా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్షికమానికి జడ్పీ చైర్‌పర్సన్ విజయ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. దివ్యాంగులు సామాజిక, ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం బడ్జెట్లో అధికంగా నిధులు కేటాయిస్తోందన్నారు. ఆత్మవిశ్వాసంతో అవకాశాలను అందిపుచ్చుకుని, సమాజంలో దివ్యాంగులు ఉన్నతులుగా ఎదగాలని కోరారు. ఈ సందర్భంగా దివ్యాంగ ఉద్యోగులు, దివ్యాంగులను ఘనంగా సన్మానించారు. అంతకు ముందు స్థానిక మల్టీపర్పస్ స్కూల్ నుంచి దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ వరకు చేపట్టిన దివ్యాంగుల, ఉద్యోగుల ర్యాలీని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, జడ్పీ చైర్‌పర్సన్ విజయలు జెండా ఊపి ప్రారంభించారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్షికమాలు
దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగ పిల్లలు, దివ్యాంగులు కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్షికమాలు ఆకట్టుకున్నాయి. ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చూపిన దివ్యాంగులకు నగదు ప్రోత్సాహకంతో పాటు జ్ఞాపికలను జడ్పీ చైర్‌పర్సన్ విజయ, ఎమ్మెల్సీ నారదాసు, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ల చేతుల మీదుగా అందజేశారు.

సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, జిల్లా సంక్షేమ అధికారి ఎం శారద, డీఆర్‌డీఓ వెంక జిల్లా విద్యాధికారి ఎన్‌వీ దుర్గావూపసాద్, బాలరక్ష భవన్ జిల్లా కోఆర్డినేటర్ సరస్వతీ, మెప్మా పీడీ పవన్‌కుమార్, లీడ్ బ్యాంకు మేనేజర్ రమేశ్‌కుమార్, సీడీపీఓ సీహెచ్ శారద, లీగల్‌సెల్ జిల్లా అథారిటీ సంజయ్, వీహెచ్‌పీఎస్ సంఘ నాయకులు మొగిలి లక్ష్మణ్, స్వామీ ఎన్నం శ్రీనివాసు, జక్కం సంపత్‌తో పాటు జిల్లాలోని వివిధ దివ్యాంగుల పాఠశాలల ప్రిన్సిపాళ్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

77
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles