అద్భుత నగరంగా తీర్చిదిద్దుతాం

Wed,December 4, 2019 02:06 AM

-స్మార్ట్‌సిటీ పనుల్లో వేగం పెంచాం
-తుది దశకు ప్రధాన రోడ్ల పనులు
-మూడేళ్లలో రూపురేఖలు మారుస్తాం
-మంత్రి గంగుల కమలాకర్
-అభివృద్ధికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: త్వరలోనే కరీంనగర్‌ను అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతామనీ, దీనికోసం అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కిసాన్‌నగర్‌లో చేపడుతున్న స్మార్ట్‌సిటీ రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెనుకబడిన కరీంనగర్‌ను అభివృద్ధిలోకి తీసుకురావడంపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారని తెలిపారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌ను కాదనీ, స్మార్ట్‌సిటీ పథకంలో కరీంనగర్ ఎంపికయ్యేలా కృషి చేశారని చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నగరంలో అభివృద్ధి జరుగలేదని విమర్శించారు. స్మార్ట్‌సిటీ కింద మూడు ప్యాకేజీల్లో పనులు చేపడుతామని తెలిపారు.

ఈ పనులు నెలల కిత్రమే మొదలుపెట్టాల్సి ఉన్నా కొంత మంది ఇబ్బందులు సృష్టించడం వల్ల ఆలస్యమైందన్నారు. వాటన్నింటినీ పరిష్కరించుకొని ఇప్పుడు పనులు చేపడుతున్నామన్నారు. ఇప్పటికే హౌసింగ్‌బోర్డు కాలనీల్లో రోడ్డు పనులు జరుగుతున్నాయనీ, వీటిల్లో విద్యుత్ పోల్స్ తొలగించాల్సి ఉందని చెప్పారు. దీనిపై త్వరలోనే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒకటి, మూడు ప్యాకేజీల్లో నగరంలోని 21 ప్రధాన రోడ్లను తీసుకున్నామన్నారు. దీనిలో భాగంగా మొదటగా ఏడు రోడ్ల పనులు చేపడుతున్నామనీ, కలెక్టరేట్, భగత్ చౌరస్తా నుంచి రాంచంవూదపూర్, ఎల్‌ఐసీ కార్యాలయం రోడ్డు, రాజీవ్‌చౌక్ టు రైల్వేస్టేషన్ రోడ్డు, యూనివర్సిటీ రోడ్డు పనులు జరుగుతున్నాయని వివరించారు.

గతంలో ఈ రోడ్లన్ని కూడ 30 ఫీట్ల మేరకు ఉన్నాయనీ, అయితే మాస్టర్ ప్లాన్ మేరకు 60 ఫీట్ల రోడ్లలో ఉన్న ఆక్రమణలను తొలగించి విస్తరణ పనులు చేస్తున్నామన్నారు. నగరంలో అద్భుతమైన రోడ్లు వేస్తున్నామని తెలిపారు. ఈ పనుల్లో మొదటగా ఒక కిలోమీటర్ రోడ్డు వేసి ప్రజలకు చూపిస్తామన్నారు.

ప్రజలు కూడ రోడ్ల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. వీటితో పాటుగా సీఎం కేసీఆర్ ఇచ్చిన నిధులతో నగరంలో ప్రధాన రహదారుల అభివృద్ధి పనులు తుది దశకు వచ్చాయన్నారు. అలాగే వందల కోట్ల నిధులతో చేపడుతున్న అంతర్గత రోడ్లు కూడ పూర్తి కావస్తున్నాయని తెలిపారు. 70 ఏండ్ల చరివూతలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి సీఎం కేసీఆర్ నగరాభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేయించారన్నారు. వీటితో రెండు, మూడేండ్లలోనే కరీంనగర్ రూపురేఖలు పూర్తిగా మారి ఒక అద్భుతమైన నగరంగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్షికమంలో నగర కమిషనర్ వేణుగోపాల్‌డ్డి, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, మాజీ కార్పొరేటర్లు వై సునీల్‌రావు, ఎడ్ల సరిత అశోక్, కంసాల శ్రీనివాస్, నాయకులు చల్ల హరిశంకర్, డీ శ్రీధర్, పెండ్యాల మహేశ్, పెద్దపల్లి రవీందర్, రమణ తదితరులు పాల్గొన్నారు.

85
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles