వంద పడకల దవాఖానగా హుజూరాబాద్ సీహెచ్‌సీ

Tue,December 3, 2019 02:03 AM

హుజూరాబాద్‌టౌన్: తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ హుజూరాబాద్ సీహెచ్‌సీని 100 పడకల ఏరియా దవాఖానగా అప్‌క్షిగేడ్ చేస్తూ జీవో నంబర్ 163 జారీ చేశారని దవాఖాన మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వాడే రవివూపవీణ్‌డ్డి సోమవారం తెలిపారు.


ఇంతకుముందు 50పడకల దవాఖానగా ఉన్న దీనిని 100 పడకలకు పెంచడంతో పాటు అడ్మినిస్ట్రేషన్ అధికారిగా ఆర్‌ఎంవో గా డాక్టర్ పీ శ్రీకాంత్‌డ్డిని నియమిస్తూ టీవీవీపీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశాడన్నారు. దీంతో పే దలకు ఈ దవాఖానలో వైద్య సేవలు మెరుగవనున్నాయని తెలిపారు. తనపై ఎంతో నమ్మకంతో వంద పడకల దవాఖానకు ఆర్‌ఎంవోగా నియమించేందుకు కృషి చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, సూపరింటెండెంట్ ర వివూపవీణ్‌డ్డికి శ్రీకాంత్‌డ్డి కృతజ్ఞతలు తెలిపారు.

72
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles