అక్రమ అమ్మకందారులను గుర్తించండి

Tue,December 3, 2019 02:01 AM

-రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల ఆదేశం
-అధికారులతో సమీక్షా సమావేశం

(కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ)
గత యాసంగి ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉందనీ, విజిపూన్స్ అధికారులు లోతుగా విచారణ జరిపి త్వరగా నివేదికలు ఇవ్వాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో జాయింట్ కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్‌లాల్, విజిపూన్స్, ఇతర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఒక్క గుంట భూమి కూడా లేని వారు, రైతుల నుంచి కౌలుకు తీసుకున్నట్లు పత్రాలు సృష్టించి, తక్కువ ధరకు ధాన్యం కొని, కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు అమ్మడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. దీని వెనక అధికారుల పాత్ర ఏమైనా ఉన్నదా?, మిల్లర్లకు సహకరించే అధికారులు ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో కూడా విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.

గన్నేరువరం మండలం చొక్కారావుపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అక్రమాలు జరిగాయనీ, క్షేత్రస్థాయిలో విజిపూన్స్ అధికారులతో విచారణ జరిపించి వెంటనే నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ధాన్యం అక్రమ అమ్మకందారులను గుర్తించాలనీ, సూత్రదారులు, పాత్రదారులు ఎవరైనా కఠినంగా శిక్షించాలన్నారు. పౌరసరఫరాల శాఖ ద్వారా నూతనంగా ఒక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించామనీ, అందులో ప్రతి గ్రామంలో ‘ఏ రైతుకు ఎంత భూమి ఉంది?’, ‘ఏ పంటలు వేశారు?’, ‘ఎంత ధాన్యం దిగుబడి వచ్చింది?’, ‘ఏ కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్ముకోవాలి’ అనే పూర్తి వివరాలుంటాయని తెలిపారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి అక్రమ ధాన్యం అమ్మకాలను అరికట్టాలని సూచించారు.

ఒక మండలంలోని రైతు వేరే మండలంలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మితే వాటిపై నిఘా పెట్టాలన్నారు. ఒక మండలంలోని వారు వేరే మండలాల్లో ధాన్యం అమ్మకాలపై పూర్తి స్థాయిలో విజిపూన్స్ విచారణ జరిపించాలని ఆదేశించారు. ఒక్క రూపాయీ కూడా అక్రమ అమ్మకందారులు, దళారులకు దక్కకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. చొక్కారావుపేట కొనుగోలు కేంద్రంలో జరిగిన అవకతవకలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలనీ, ఒక్క క్వింటాల్ కూడా అక్రమంగా కొనవద్దనీ, అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలకు తావు లేకుండా పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు చేయాలని ఆదేశించారు. జిల్లాలో వచ్చే రెండు, మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశాలున్నాయనీ, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా టార్ఫాలిన్లు కప్పాలన్నారు. జిల్లాలో పీడీఎస్ బియ్యాన్ని దళారులు రీసైక్లింగ్ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారనీ, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కొందరు దళారులు రూపాయికి కిలో బియ్యం కొనుగోలు చేసి ప్రభుత్వానికి రూ.29కి అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.

హుజూరాబాద్‌లో 200 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని తరలించే లారీని అధికారులు సీజ్ చేశారని తెలిపారు. ఇందులో అసలు సూత్రదారులను గుర్తించి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో చీఫ్ విజిపూన్స్ అధికారి కల్నల్ ఎంఎస్ ప్రకాశ్, విజిపూన్స్ అదనపు ఎస్పీ రామారావు, జిల్లా పౌర సరఫరాల అధికారి సురేశ్‌డ్డి, సివిల్ సప్లయ్ డీఎం ఎం శ్రీకాంత్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఏ వెంక రావు, జిల్లా సహకార అధికారి మనోజ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.

69
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles