స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత

Sun,August 25, 2019 01:11 AMస్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత
గంగాధర: స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత అని స్వచ్ఛ సర్వేక్షన్ రాష్ట్ర బృందం సభ్యులు ఉదయశ్రీ, రజిత అన్నారు. మండలంలోని గట్టుభూత్కూర్, గర్శకుర్తి గ్రామాల్లో చేపడుతున్న పారిశుధ్య పనులను శనివారం వారు పరిశీలించారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల, ఆలయం, ఆరోగ్య ఉపకేంద్రం, అంగన్‌వాడీ కేంద్రాల ఆవరణలో స్వచ్ఛతను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామ పంచాయతీ పరిధిలో సిబ్బంది చేపడుతున్న పారిశుధ్య పనులను చూసి సర్పంచులు కంకణాల విజేందర్‌రెడ్డి, అలువాల నాగలక్ష్మిని అభినందించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్వశక్తి సంఘాల సభ్యులు, ఆశ కార్యకర్తలు, యూత్ వలంటీర్లతో సమావేశం నిర్వహించారు. జలశక్తి అభియాన్‌లో భాగంగా గ్రామంలో నిర్మించిన ఇంకుడు గుంతలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో యూనీసెఫ్ ప్రాజెక్టు సమన్వయకర్త కిషన్‌స్వామి, ఎంపీపీ శ్రీరాం మధుకర్, వైస్ ఎంపీపీ కంకణాల రాజ్‌గోపాల్‌రెడ్డి, ఎంపీడీవో నర్సయ్య, ఉపసర్పంచులు దాది జలపతి, శ్రీనివాస్, నాయకులు అలువాల తిరుపతి, తదితరులు పాల్గొన: స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత అని స్వచ్ఛ సర్వేక్షన్ రాష్ట్ర బృందం సభ్యులు ఉదయశ్రీ, రజిత అన్నారు. మండలంలోని గట్టుభూత్కూర్, గర్శకుర్తి గ్రామాల్లో చేపడుతున్న పారిశుధ్య పనులను శనివారం వారు పరిశీలించారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల, ఆలయం, ఆరోగ్య ఉపకేంద్రం, అంగన్‌వాడీ కేంద్రాల ఆవరణలో స్వచ్ఛతను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామ పంచాయతీ పరిధిలో సిబ్బంది చేపడుతున్న పారిశుధ్య పనులను చూసి సర్పంచులు కంకణాల విజేందర్‌రెడ్డి, అలువాల నాగలక్ష్మిని అభినందించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్వశక్తి సంఘాల సభ్యులు, ఆశ కార్యకర్తలు, యూత్ వలంటీర్లతో సమావేశం నిర్వహించారు. జలశక్తి అభియాన్‌లో భాగంగా గ్రామంలో నిర్మించిన ఇంకుడు గుంతలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో యూనీసెఫ్ ప్రాజెక్టు సమన్వయకర్త కిషన్‌స్వామి, ఎంపీపీ శ్రీరాం మధుకర్, వైస్ ఎంపీపీ కంకణాల రాజ్‌గోపాల్‌రెడ్డి, ఎంపీడీవో నర్సయ్య, ఉపసర్పంచులు దాది జలపతి, శ్రీనివాస్, నాయకులు అలువాల తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles