రైతులకు న్యాయం చేస్తాం..

Sun,August 25, 2019 01:10 AM

గంగాధర: వరదకాలువ నుంచి ఎస్సారెస్పీ లింక్ కాలువ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హామీ ఇచ్చారు. లింక్ కెనాల్ కింద భూములు కోల్పోతున్న రైతులు శనివారం చొప్పదండిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిశారు. కాలువ కింద ర్యాలపల్లి గ్రామానికి చెందిన 28 మంది రైతులకు చెందిన 19.23 ఎకరాల భూమి ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా తీసుకున్నారనీ, భూసేకరణ జరిపిన సమయంలో ఎకరానికి 9 లక్షలు చెల్లిస్తామని అధికారులు తెలిపారన్నారు.

తమకు చెల్లించే పరిహారం తక్కువగా ఉందనీ, తాము తీవ్రంగా నష్టపోతున్నామన్నారు ఎకరానికి 13 లక్షలు చెల్లించేలా చూడాలన్నారు. సర్పంచ్ పానుగంటి లక్ష్మీనారాయణ, ఎంపీటీసీ అట్ల రాజిరెడ్డి, నాయకులు పుల్కం నర్సయ్య, అట్ల శేఖర్‌రెడ్డి, బొజ్జ మహిపాల్, రైతులు పాల్గొన్నారు. కాగా, మాజీ కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ మృతి దేశానికి తీరనిలోటని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. శనివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన జైట్లీ మృతికి సంతాపం తెలిపారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles