రక్తదాన శిబిరానికి విశేష స్పందన

Sun,August 25, 2019 01:09 AM

హుజూరాబాద్ టౌన్: ఏరియా దవఖాన మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వాడె రవిప్రవీణ్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏరియా దవాఖానలో శనివారం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జిల్లా వైధ్యాధికారి డాక్టర్ రాంమోహన్‌రావు, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ మంద ఉమాదేవి రిబ్బన్ కట్ చేసి, శిబిరాన్ని ప్రారంభించారు. పట్టణ, మండలానికి చెందిన ప్రజలతో పాటు పాత్రికేయులు, రాజకీయ ప్రముఖులు, వైద్యులు, వైద్య సిబ్బంది మొత్తం 119 మంది రక్తదానం చేశారని సూపరింటెండెంట్ రవిప్రవీన్‌రెడ్డి తెలిపారు.

సూపరింటెండెంట్ రవిప్రవీన్‌రెడ్డి 30వసారి, జమ్మికుంట దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ అనితరెడ్డి నాలుగోసారి, ఆరుగురు పాత్రికేయులు, 8 మంది మాజీ కౌన్సిలర్లు, వైద్య సిబ్బంది రక్తదానం చేసిన వారిలో ఉన్నారని చెప్పారు. రక్తదానం చేసిన వారికి రెడ్‌క్రాస్ సొసైటీ సర్టిఫికెట్లు అందజేయగా, హెల్త్ ఎడ్యుకేటర్ అశోక్‌కుమార్ పండ్లు పంపిణీ చేశారు. క్యాంప్ వ్యవహారాలను ఐసీటీసీ ఉద్యోగులు సుజాత, నిర్మల, నిషాంత్, కిరణ్, సారయ్య, శంకర్, ఎల్లయ్య, అనిత, జాన్ చూసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ రాజమౌళి, జిల్లా ఆర్డినేటర్ నాగేందర్, రెడ్‌క్రాస్ (వరంగల్ అర్బన్) డాక్టర్ పోల్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

68
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles