ఎన్‌ఎస్‌ఎస్‌లో అల్ఫోర్స్ విద్యార్థుల ప్రతిభ

Sun,August 25, 2019 01:09 AM

కరీంనగర్ ఎడ్యుకేషన్: శాతవాహన యూనివర్సిటీలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఎన్‌ఎస్‌ఎస్ శిక్షణ శిబిరంలో భాగంగా స్థానిక అల్ఫోర్స్ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు కళాశాల కరస్పాండెంట్ వీ రవీందర్‌రెడ్డి తెలిపారు. ఉత్తమ వలంటీర్‌గా సాయిశ్రీ, బృంద నృత్య విభాగంలో కళాశాలకు చెందిన విద్యార్థులు దక్షిత, సాయిశ్రీ, దివ్యశ్రీప్రథమ స్థానంలో నిలిచారని చెప్పారు. బృంద గాన విభాగంలో దక్షిత, దివ్య ద్వితీయ స్థానాలు కైవసం చేసుకున్నారని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్‌తో పాటు ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, ఎన్‌ఎస్‌ఎస్ అధికారి గోలి శ్రీనివాస్, అధ్యాపకులు అభినందించారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles