ఫార్మసిస్టులకు సామాజిక బాధ్యత ఉండాలి

Sat,August 24, 2019 12:50 AM

తిమ్మాపూర్, నమస్తే తెలంగాణ: సమాజంలో ఫార్మసిస్టులు సామాజిక బాధ్యతను కలిగి ఉండాలని హైదరాబాద్ నైసర్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ శశిబాలసింగ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్) శాస్త్రవేత్త డాక్టర్ జీ దినేశ్ సూచించారు. మండలంలోని వాగేశ్వరి ఫార్మసీ కళాశాలలో నైసర్ హైదరాబాద్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో శుక్రవారం గుడ్ ఫార్మసీ ప్రాక్టీస్ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నైసర్ డైరెక్టర్ డాక్టర్ శశిబాలసింగ్, ఎన్‌ఐఎన్ సైంటిస్ట్ డాక్టర్ జీ దినేశ్ హాజరై మాట్లాడారు. సమాజంలో ఫార్మసిస్టుల పాత్ర చాలా గొప్పదనీ, అంకితభావంతో పని చేయాలని సూచించారు.

కేంద్ర ప్రభుత్వ గైడ్‌లైన్స్ ప్రకారం నాణ్యమైన మందులు ఇవ్వాలన్నారు. అలాగే, మందుల విక్రయాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉండాలన్నారు. అనంతరం గుడ్ ఫార్మసీ ప్రాక్టీస్‌లో భాగంగా ఫార్మకో విజిలెన్స్ ప్రాముఖ్యత, ప్రమాణ నాణ్యత లేని మందులను గుర్తించే విధానం, రోగుల ఆరోగ్య్నా దృష్టిలో ఉంచుకుని ఔషధాల మోతాదును నిర్దారించే విధానాన్ని విపులంగా వివరించారు.

వరంగల్ డ్రగ్ ఇన్స్‌పెక్టర్ కిరణ్‌కుమార్ డిస్పెన్సింగ్ ఎర్రర్స్ అనే అంశంపై, మందులు జారీ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కాగా, సదస్సులో పాల్గొన్న విద్యార్థినీ, విద్యార్థులు, అధ్యాపకులకు సర్టిఫికెట్స్ అందజేశారు. అనంతరం అతిథులను వాగేశ్వరి యాజమాన్యం ఘనంగా సన్మానించింది. బాపట్ల ఫార్మసీ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ టీఈ గోపాలకృష్ణమూర్తి, వాగేశ్వరి కళాశాల డైరెక్టర్ వినోద్ విశ్వనాథ్, నైసర్ రీసెర్చ్ సైంటిస్ట్ డాక్టర్ పంకజ్‌కుమార్‌సింగ్, సర్వోత్తమ్ కేర్ హైదరాబాద్ నీలేశ్ జైస్వాల్, నైసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గణనాథం, వాగేశ్వరి ఫార్మసీ కళాశాలల ముఖ్య కార్యదర్శి గండ్ర శ్రీనివాస్‌రెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఎం. శ్రీనివాస్‌రెడ్డి, ఆర్. రామకృష్ణ, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles