నెలలోగా పనులు పూర్తిచేయాలి

Wed,August 21, 2019 04:33 AM

-సద్దుల బతుకమ్మకు చెరువుల వద్ద ఏర్పాట్లు చేయాలి
-చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్
-మిషన్ కాకతీయ పనులపై ఇరిగేషన్ అధికారులతో సమీక్ష
చొప్పదండి, నమస్తే తెలంగాణ: మిషన్‌కాకతీయ పనులను నెలలోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆదేశించారు. చొప్పదండిలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆవరణలో మంగళవారం ఇరిగేషన్ అధికారులతో మిషన్‌కాకతీయ పనుల పురోగతిపై సమీక్షా సమవేశం నిర్వహించారు. మిషన్‌కాకతీయ 1,2,3,4 విడతల్లో చేపట్టిన పనులు, వాటి పురోగతి గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో చెరువుల భూములు ఆక్రమణకు గురవుతున్నాయనీ, ఎలాంటి ఆక్రమణలు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడకముందు ఎవరూ చెరువులను పట్టించుకున్న పాపాన పోలేదనీ, టీఆర్‌ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చాక చెరువులను అభివృద్ధి పరచాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా మిషన్ కాకతీయ పథకాన్ని తీసుకొచ్చారన్నారు. పనులను నెలలోగా పూర్తి చేసి, వచ్చే సద్దుల బతుకమ్మకు చెరువులను సిద్ధంచేయాలన్నారు. చొప్పదండిలోని కుడిచెరువును మినీట్యాంక్ బండ్‌గా చేయడం తన జీవితలక్ష్యం అని పేర్కొన్నారు. కానీ, ఆ దిశగా చేపడుతున్న పనులు కాంట్రాక్టర్ అలసత్వంతో మందకొండిగా సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలలోగా పూర్తి చేసి ప్రజలకు కానుకగా ఇచ్చేందుకు అధికారులు కృషిచేయాలని పిలుపునిచ్చారు. కుడిచెరువు కట్ట మరమ్మతు పనులు నాణ్యత ప్రమాణాలు లేకుండా చేయడంతో చిన్నపాటి వర్షానికి బురదమయం అవుతుందనీ, కట్టపై సీసీ రోడ్డు వేయించాలని స్థానిక నాయకులు ఎమ్మెల్యేను కోరారు. సీసీ రోడ్డు నిర్మాణానికి పంచాయతీరాజ్ నిధులు మంజూరు చేసి, రోడ్డు నిర్మాణం చేసేలా కృషిచేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం చొప్పదండిలోని కుడిచెరువు వద్ద చేపట్టిన పనులను పరిశీలించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ రవి, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్‌గుప్తా, డీఈ ప్రాణిల్‌కుమార్, ఏఈ అలీ, మాజీ ఎంపీపీలు గుర్రం భూమారెడ్డి, వల్లాల క్రిష్ణహరి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు మంద నర్సయ్య, పట్టణాధ్యక్షుడు గంగారెడ్డి, నాయకులు గడ్డం చుక్కారెడ్డి, నలుమాచు రామక్రిష్ణ, ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, మాచర్ల వినయ్, గుర్రం ఇంద్రసేనారెడ్డి, గుర్రంహన్మంతరెడ్డి, లోకరాజేశ్వర్‌రెడ్డి, గొల్లపల్లి శ్రావణ్, బత్తిని సంపత్,శేషు, శేషాద్రి, కొత్తూరి మహేశ్, వడ్లకొండ శ్రీనివాస్, దండెక్రిష్ణ , అన్నాడి సుధాకర్‌రెడ్డి, మావూరపు మహేశ్ పాల్గొన్నారు.

మోతెవాగుపై చెక్‌డ్యాంలు..
-ఎమ్మెల్యే సుంకె గ్రీన్‌సిగ్నల్
రామడుగు: మోతెవాగు పరివాహక గ్రామాల రైతులు, ప్రజల కష్టాలు మరికొన్ని రోజుల్లో తీరనున్నాయి. మోతెవాగుపై చెక్ డ్యాంల నిర్మాణానికి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పచ్చజెండా ఊపారు. దీంతో మోతెవాగు ఏడాది పొడవునా నీటితో కళకళలాడుతూ సజీవంగా మారనుంది. మండలంలోని మోతెవాగు పరిధిలో రామడుగు, షానగర్, కొరటపల్లి, గోలిరామయ్యపల్లి, రుద్రారం, మోతె, కొక్కెరకుంట, వన్నారం గ్రామాలకు నిత్యం నీరందించేందుకు వాగుపై మొత్తం ఆరు చెక్ డ్యాంల నిర్మాణానికి మంగళవారం చొప్పదండిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి సాధాసాధ్యాలను పరిశీలించారు. ప్రణాళికలను పరీక్షించి, చెక్ డ్యాంల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒక్కో చెక్‌డ్యాంలో సుమారు ఏడడుగుల నీరు నిలిచి ఉండి 11 వందల మీటర్ల వరకు బ్యాక్ వాటర్ నిలువ ఉండేలా ప్రణాళికలు చేపట్టారు. ఆరు చెక్ డ్యాంల నిర్మాణానికి సుమారు రూ. 21.45 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా వేయగా, ఈ ప్రాజెక్టు పూర్తయితే భూగర్భ జలాలు పెరగడమే కాకుండా 960 ఎకరాలకు నీరందనుందని పేర్కొన్నారు. ఇక్కడ నీటిపారుదల ఏఈ రమేశ్, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, టీఆర్‌ఎస్ నాయకుడు కలిగేటి లక్ష్మణ్ ఉన్నారు.

సత్ప్రవర్తనతో మెదలాలి..
కరీంనగర్ క్రైం: నేర చరిత్ర కలిగిన వారు సత్ప్రర్తనతో మెదలాలని సీపీ కమలాసన్‌రెడ్డి సూచించారు. మంగళవారం కమిషనరేట్ కేంద్రంలోని ఓపెన్ ఎయిర్ థియేటర్ ఆవరణలో కరీంనగర్ సబ్ డివిజన్ రౌడీ, హిస్టరీ షీటర్లు, మత పరమైన అల్లర్ల కేసులో నేర చరిత్ర కలిగిన వారికి మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, వివిధ రకాల నేరాల్లో చురుగ్గా భాగస్వాములవుతున్న వారిపై హిస్టరీ షీట్లు కొనసాగిస్తామన్నారు. నేర చరిత్ర కలిగిన వారు సమాజంలో నిరాధరణకు గురై వాటి ప్రభావం వారి కుటుంబ సభ్యులపై కూడా పడుతుందన్న విషయం గుర్తించాలన్నారు. కమిషనరేట్‌లో గత ఏడాది నుంచి క్రమం తప్పకుండా మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. నేరాలకు దూరంగా ఉండి సత్ప్రర్తనతో మెదిలితే షీట్లు తొలగిస్తామని తెలిపారు. ప్రతి నెలా 1, 16వ తేదిల్లో పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి వివరాలు, సంతకాలు సేకరిస్తున్నామనీ, నేర చరిత్రకు దూరంగా ఉండి సమాజంలో మంచి వ్యక్తులుగా గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు శ్రమిస్తున్నారనీ, పండుగల సందర్భాల్లో సోషల్ మీడియాల్లో అభ్యంతకర పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మేళాకు గైర్హాజరైన వారి కాల పరిమితి మరో ఆరు నెలలకు పొగిగించాలని అధికారులను ఆదేశించారు. టౌన్ ఏసీపీ అశోక్, సీఐలు దేవారెడ్డి, విజయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.

59
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles