ప్రారంభానికి బ్రిడ్జి సిద్ధం

Mon,July 15, 2019 12:57 AM

హుజురాబాద్‌: పట్టణ సమీపంలోని ఇప్పలనర్సింగాపూర్‌ వెళ్లే రహదారిలో గల చిలుక వాగుపై చేపట్టిన బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది.15 నెలల క్రితం పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ సకాలంలో పని పూర్తి చేసినట్లు పంచాయితీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు. చిలుకవాగుపై రాకపోకల కోసం 30 ఏండ్ల క్రితం రోడ్డుడ్యాం నిర్మించారు. అప్పుడు ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉం డడంతో ఆ రోడ్డాం సరిపోయింది. రానురాను ప్రయాణికుల రాకపోకలు పెరిగిపోవడంతో పాటు అది శిథిలావస్థకు చేరుకుంది. ఈ విషయాన్ని మంత్రి ఈటల రాజేందర్‌ దృష్టికి పలు గ్రామస్థులు తీసుకెళ్లారు.దీనికి స్పందించిన ఆయన వెంటనే బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశారు.ఈ మేరకు 15 నెలల క్రితం రూ.5 కోట్లతో వంతెనతో పాటు చెక్‌డ్యాం నిర్మాణం చేయడానికి శంకుస్థాపన జరుగగా దాదాపు పనులు పూర్తయ్యాయి.చెక్‌డ్యాంతో చుట్టు ప్రక్కల దాదాపు 70 ఎకరాలకు ఢోకా లేకుండా ఉంటుందని రైతులు ఆనం దం వ్యక్తం చేస్తున్నారు.చిన్నచిన్న పనులు మిగిలి ఉన్నాయని, పూర్తయిన వెంటనే రేపోమాపో ప్రారంభోత్సవం చేస్తామని అధికారులు పేర్కొన్నారు. ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

99
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles