మహిళలతోనే ఇంటింటా ప్రగతి..

Mon,July 15, 2019 12:57 AM

మానకొండూర్‌: మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రతి ఇల్లూ ప్రగతిపథంలో ఉంటుందని సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు పేర్కొన్నారు. మహిళా అభివృద్ధ్ది, శిశు సంక్షేమ శాఖ, వికాస తరంగిణి సంయుక్త ఆధ్వర్యంలో అదివారం మానకొండూర్‌లో ఏర్పాటు చేసిన ‘మహిళ ఆరోగ్య వికాస్‌ అవగాహన-చికిత్స వైద్యశిబిరం’ ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఎంపీపీ ముద్దసాని సులోచనతో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి, శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవీఆర్‌ మాట్లాడుతూ, మహిళా ఆరోగ్యం దేశ ప్రగతికి ఆధారం అనే ఆశయంతో ట్రస్టును ఏర్పాటు చేసి, మహిళలకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్న జీయర్‌ ట్రస్టు సేవలు అభినందనీయమని కొనియడారు. మహిళ ఆరోగ్య వికాస్‌ద్వారా ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ర్టాలే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు నేపాల్‌లో 903 శిబిరాలను నిర్వహించి, 9 లక్షల మంది మహిళలకు వైద్యసేవలను అందించినట్లు శిబిరం ఇన్‌చార్జి వెల్లడించారు. మానకొండూర్‌లోని వైద్యశిబిరానికి 190 మంది మహిళలు హాజరుకాగా, వారికి వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందజేశారు. జడ్పీటీసీ టీ శేఖర్‌గౌడ్‌, ఎంపీపీ ఎం. సులోచన, సర్పంచ్‌ పృథ్వీరాజ్‌, ఎంపీటీసీ పీ కవిత, జిల్లా సంక్షేమ శాఖాధికారి శారద, మండల వైద్యాధికారిణి సంధ్యారాణి, ఐసీడీఎస్‌ సీడీపీవో సబిత, ఏసీడీపీవో సరస్వతి, వికాస తరంగిణి సభ్యులు ప్రభాకర్‌రావు, ఆశోక్‌రావు, రాధాకిషన్‌, రమాదేవి, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు ఇందిర, విజయ, అంగన్‌వాడీ టీచర్లు, ఆశ సిబ్బంది పాల్గొన్నారు.

60
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles