కష్టపడ్డారు.. సాధించారు..

Mon,July 15, 2019 12:56 AM

* ఎస్‌ఐ పోస్టులకు ఎంపికైన యువకులు
* నిరుపేద కుటుంబాల నుంచే అత్యధికులు
* కఠోర శ్రమతో విజయ తీరాలకు
కరీంనగర్‌ క్రైం: పట్టుదల ఉంటే సాధించలేనిదేమీ లేదని నిరూపించారు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా యువతీ యువకులు. శుక్రవారం వెలువడిన ఎస్‌ఐ ఫలితాల్లో లక్ష్యాన్ని చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్‌శాఖకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడమేకాక నియమాకాలను సైతం భారీగా చేపట్టడంతో పోలీసు కావాలన్న ఎంతో మంది తమ కలలు సాకారం చేసుకున్నారు. వీరంతా కానిస్టేబుల్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వెలువడినప్పటి నుంచే శారీరక పరీక్షలకు సిద్ధమవుతూనే రాత పరీక్షలకు సన్నద్ధమయ్యారు. అనుకున్నదే తడువుగా అన్నింట్లోనూ విజయం సాధించి, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు ఎంపికయ్యారు. ఇందులో అత్యధికులు నిరుపేదలే ఉన్నారు. పేదరికం వెంటాడినా తాము అనుకున్న లక్ష్యం కోసం అహర్నిశలూ శ్రమించి ఇటీవల వెల్లడించిన ఫలితాల్లో సత్తాచాటారు.

71
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles