బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు

Thu,July 11, 2019 01:48 AM

ఫెర్టిలైజర్‌సిటీ : క్రికెట్ బెట్టింగ్‌లపై రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ దృష్టి సారించారు. ఆయన ఆదేశాల మేరకు రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగగా, బుధవారం రాత్రి గోదావరిఖని అడ్డగుంటపల్లిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న స్థావరంపై దాడులు నిర్వహించగా, రూ. 27 వేల నగదు, ఆరు సెల్‌ఫోన్లు లభ్యమయ్యాయి. రామగుండం సీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు ఎస్‌బీ సీఐ సతీశ్, గోదావరిఖని వన్ టౌన్ సీఐ పర్స రమేశ్, టాస్క్‌ఫోర్సు ఎస్‌ఐ సమ్మయ్య గోదావరిఖని నగరంలో తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు అడ్డగుంటపల్లిలోని ఒక దుకాణంలో కొంతమంది రహస్యంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని వెంటనే దాడులు నిర్వహించారు. ఇక్కడ గుంజి లక్ష్మీనారాయణ(కృష్ణానగర్), తన్నీరు తిరుపతి(విఠల్‌నగర్), గుంజి రవి(విఠల్‌నగర్), గుంజి హరిబాబు (పరశురాం నగర్), ఉప్పుటూరి కోటేశ్వరరావు(కృష్ణానగర్), సల్లెపు నాగరాజు(ఫైవింక్లయిన్)లు దొరికారు. వీరి నుంచి రూ.27,200 నగదు స్వాధీనం చేసుకుని గోదావరిఖని వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. ఈ దాడుల్లో ఎస్బీ సీఐ సతీశ్, టాస్క్‌ఫోర్సు సిబ్బంది సమ్మయ్య, సంపత్, ప్రకాశ్, మల్లేష్, శ్రీనివాస్ ఉన్నారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles