వడివడిగా సాగు

Mon,July 8, 2019 03:28 AM

(కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ):ఈ సీజన్‌లో వర్షాలు చాలా ఆలస్యంగా వచ్చాయి. జూన్‌లో 10 నుంచి పంటల సీజన్ ప్రారంభం కావాల్సి ఉండగా ఎక్కడ కూడా వర్షాలు కురియలేదు. నెలాఖరు వరకు 38నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ నెల మొత్తంలో కేవలం ఐదు రోజులు మాత్రమే వర్షం కురిసింది. జూన్‌లో సాధారణ వర్షపాతం 124.5మిల్లీ మీటర్లు కాగా, ఐదు రోజుల్లో కేవలం 72.7 మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. దీంతో రైతులు పంటలు సాగు చేసే పరిస్థితి కనిపించలేదు. బావుల కింద నీళ్లున్న రైతులు దుక్కులు తడుపుతూ పత్తి, మక్కజొన్న పంటలు విత్తుకున్నారు. జూలైలోనైనా వర్షాలు కురుస్తాయన్న భరోసాతో రైతులు పంటలు విత్తుకునే సాహసం చేశారు. అయి తే, జూలైలో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 38.4 మిల్లీ మీటర్లు కాగా, ఇప్పటి వరకు 61.0మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 163 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి కేవలం 133.8మిల్లీ మీటర్లు మాత్రమే వర్షపాతం నమోదైంది. దీంతో అనివార్యంగా పంటలసాగుకు ఆలస్యమవుతోంది.

సాగు చేసింది 34 శాతమే..
జిల్లాలో ఇప్పటి వరకు రైతులు 34 శాతం మాత్రమే పంటలు సాగు చేసినట్లు అధికారుల లెక్కలు వెల్లడిస్తున్నా యి. అయితే, గతేడాది వానాకాలం సీజన్‌తో పోల్చుకుంటే వ్యత్యాసం పెద్దగా లేదు. నిరుడు ఇదే నెలలో ఇప్పటి వరకు 42 శాతం మాత్రమే పంటలు సాగుచేశారు. అంటే కేవలం 8శాతం మాత్రమే వెనుకబడి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన పంటల వివరాలు చూస్తే నిరుడు ఇదే సమయానికి 368 హెక్టార్లలో వరి నార్లు పోసుకుంటే ఈసారి అంతకంటే ఎక్కువగానే 2,124 హెక్టార్లలో వరి నార్లు పోసుకున్నట్లు తెలుస్తోంది. నిరుడు ఇదే సమయానికి మక్క 4,875 హెక్టార్లలో మక్కజొన్న విత్తుకోగా ఇపుడు 5,842 హెక్టార్లలో సాగు చేశారు. మరో ప్రధానమైన పత్తి పంటను పరిశీలిస్తే నిరు డు 38,674 హెక్టార్లలో విత్తుకుంటే ఇడు 27,747 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. పత్తి నిరుడు ఇదే సమయానికి సాగు అంచనాలో 73శాతం పూర్తయితే ఇపుడు కేవలం 54 శాత మే విత్తుకోగలిగారు. మొత్తంగా చూస్తే నిరుడు 1,06,409 హెక్టార్ల సాగు అంచనాలో ఇదే సమయానికి 44,278 హెక్టార్లలో సాగు చేయగా, ప్రస్తుత సీజన్ అంచనాలో 1,10,835 హెక్టార్లలో ఇప్పటి వరకు 37,283 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు.

ఇక పుంజుకోనున్న సాగు..
ప్రస్తుత నెలలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంట లు విత్తుకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ నెల లో ఇప్పటి వరకు నమోదైన వర్షపాతాన్ని పరిశీలిస్తే ఒక్క చిగురుమామిడి మండలంలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ మండలంలో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 115.9 మిల్లీ మీటర్లు కాగా, ఇప్పటి వరకు 220.6 మిల్లీ మీటర్లు నమోదైంది. ఈ మండలంలో ఇప్పుడిప్పుడే పంటల సాగు పుంజుకుంటోంది. గంగాధర, చొప్పదండి, సైదాపూర్, జమ్మికుంట మండలాల్లోనూ పంటల సాగుకు రైతులు ఉపక్రమిస్తున్నారు. రామడుగు, కరీంనగర్ రూర ల్, కొత్తపల్లి, తిమ్మాపూర్, శంకరపట్నం, వీణవంక, హుజూరాబాద్ మండలాల్లో లోటు వర్షపాతమే కనిపిస్తోం ది. సాధారణ, లోటు వర్షపాతం ఉన్న మండలాల్లో వరుణుడిపై భారం వేసుకుని రైతులు అక్కడక్కడా పంటలు సాగు చేస్తున్నారు. ఆగస్టులోనూ వరి సాగు చేసుకునే అవకాశం ఉన్నందున ప్రస్తుతం పత్తి, మక్కజొన్న, తదితర ప్రధాన పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు.

105
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles