కొమ్ముగుట్ట క్వారీ అనుమతి రద్దుపై హర్షం

Sun,July 7, 2019 12:58 AM

-ప్రభుత్వానికి గీతకార్మిక సంఘం నాయకుల కృతజ్ఞతలు
సైదాపూర్: మండలంలోని ఆకునూర్ రెవెన్యూ శివారులోని సర్వాయిపేట కొమ్ముగుట్ట వద్ద క్వారీ రద్దుపై సర్వాయిపాపన్న గీతకార్మిక సంఘం నాయకులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్వాయిపాపన్న గీతకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కలర్ సత్తన్నగౌడ్, వ్యవస్థాపక అధ్యక్షుడు వీరగోని పెంటయ్యగౌడ్‌లు మాట్లాడుతూ సర్వాయిపాపన్న చరిత్రతో సంబంధం ఉన్న గుట్టను క్వారీకి ఇవ్వద్దని విజ్ఞప్తిచేయగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెంటనే స్పందించి కొమ్ముగుట్టపై క్వారీ అనుమతులను రద్దు చేయించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. సర్వాయిపాపన్న గుట్టల రక్షణకు 2011 నుంచి పోరాటంలో భాగస్వాములు అవుతున్న గ్రామస్తులను వారు ప్రత్యేకంగా అభినందించారు. గుట్టలు క్వారీలకిస్తే అనేక నష్టాలు జరుగుతాయన్నారు. గుట్టల ప్రాముఖ్యత, చారిత్రక అంశాలు, వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు త్వరలోనే కమిటీ కొమ్ముగుట్ట వద్దకు రానుందనీ, దానికి స్థానికులు వాస్తవ పరిస్థితులు వివరించాలని సూచించారు. పాపన్న గుట్టల్లోని గొలుసుకట్టు గుట్టలు సుమారు 40నుంచి 50 గొలుసుకట్టు చెరువులకు ఆధారమని వివరించారు. పాపన్నగుట్టలను పర్యాటక కేంద్రాలుగా ప్రభుత్వం తీర్చిదిద్దేలా కృషి చేస్తామన్నారు. త్వరలోనే మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసి పర్యాటక కేంద్రం గురించి వివరించి ఈ ప్రాంతానికి ఆహ్వానిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సింగం సత్తయ్యగౌడ్, సుడా డైరెక్టర్ శ్రీనివాస్‌గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ పోలు ప్రవీణ్‌కుమార్, సర్పంచ్ ఏనుగుల ఐలయ్య, జీవ వైవిధ్య కమిటీ చైర్మన్ మండల జంపయ్య, నాయకులు పైడిపల్లి రవీందర్‌గౌడ్, బత్తిని శ్రీనివాస్‌గౌడ్, అమృత్‌సింగ్, స్వామి తదితరులు పాల్గొన్నారు.

82
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles