అట్టహాసంగా స్వీకారోత్సవం

Fri,July 5, 2019 03:19 AM

మండల ప్రజా పరిషత్తుల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. గురువారం ప్రమాణ స్వీకారోత్సవాలు అట్టహాసంగా సాగాయి. 15 మండలాల్లో ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, కోఆప్షన్ మెంబర్లతో ప్రత్యేకాధికారులు పండుగ వాతావరణంలో ప్రమాణాలు చేయించారు. కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాల్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు, చొప్పదండి, గంగాధర, రామడుగులో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, హుజూరాబాద్, వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంటలో నూతన జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ పాల్గొనగా, అన్ని మండలాల్లో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.

కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో పండగ వాతావరణంలో మండల ప్రజాపరిషత్ పాలకవర్గాలు కొలువుదీరాయి. గురువారం అట్టహాసంగా ప్రమాణ స్వీకారాలు జరిగాయి. నిజానికి రెండు నెలల క్రితమే పరిషత్ ఎన్నికలు జరగ్గా, జూన్4న ఫలితాలను ప్రకటించారు. 7న ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకున్నారు. పాత పాలకవర్గాల బుధవారంతో ముగియగా, గురువారం కొత్త పాలకవర్గాల ప్రమాణ స్వీకారోత్సవాలు జరిపారు. జిల్లాలోని 15 మండలాల్లో నూతన ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులతో ప్రత్యేకాధికారులు ప్రమాణాలు చేయించారు. ఆ తర్వాత బాధ్యతలు అప్పగించారు. కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాల్లో స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు పాల్గొని, పాలకవర్గాలను అభినందించారు. చొప్పదండి, చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు, గంగాధర మండలాల్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొని, శుభాకాంక్షలు తెలిపారు. ఇటు హుజూరాబాద్, వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంటలో నూతన జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ, సైదాపూర్‌లో కొత్త జడ్పీ ఉపాధ్యక్షుడు పేరాల గోపాల్‌రావు పాల్గొని, అభినందనలు తెలిపారు. కొత్తగా ఏర్పడిన ఇల్లందకుంట, కొత్తపల్లి, గన్నేరువరం మండలాల్లో తొలిసారిగా ఎంపీపీలు పదవీ బాధ్యతలు స్వీకరించారు. అన్ని చోట్లా టీఆర్‌ఎస్ అభ్యర్థులే ఎంపీపీ పీఠాలను అధిరోహించడంతో, టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు సంబురాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచి, పటాకలు కాల్చారు.

99
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles