మొక్కలు నాటుదాం.. సంరక్షిద్దాం..

Fri,July 5, 2019 03:16 AM

రామడుగు: భూమిపై మానవ మనుగడ కొనసాగాలంటే మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాల్సిన అవసరముందని అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వీ నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని గోపాల్‌రావుపేట అల్ఫోర్స్ హైస్కూల్లో గురువారం నిర్వహించిన హరిత దినోత్సవ వేడుకలకు నరేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీనిలో భాగంగా చెట్లను కాపాడాలంటూ వృక్షాల వేషధారణలో చిన్నారులు ఆహూతులను అలరించారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ, ఈ ప్రపంచంలో శ్వాస తీసుకొనే ప్రతి జీవికి ఆక్సిజన్ అవసరమన్నారు. అలాంటి ప్రాణ వాయువును చెట్లే అందిస్తాయని తెలిపారు. ముఖ్యంగా భూగోళం రోజురోజుకూ వేడెక్కుతుందంటే దానికి కారణం భూమిపై అధిక శాతంలో వృక్షాలు అంతరించిపోవడమేనన్నారు. ఇక్కడ విదార్థులుతోపాటు ఉపాధ్యాయులున్నారు.

జమ్మికుంట తాసిల్ తనిఖీ
జమ్మికుంట రూరల్: మండలకేద్రంలోని తాసిల్ కార్యాలయాన్ని గురువారం జేసీ శ్యాంప్రసాద్‌లాల్ తనిఖీ చేశారు. భూ రికార్డుల ప్రక్షాళనకు సంబంధించిన పనులను పర్యవేక్షించారు. రికార్డులను పరిశీలించారు. త్వరగా సమస్యలను పరిష్కరించి, రెవెన్యూ సమస్యలు లేని మండలంగా తీర్చిదిద్దాలని తాసిల్దార్ నారాయణకు సూచించారు, కార్యాలయానికి వచ్చిన రైతులనుంచి సమస్యలు తెలుకొని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యాలయంలో, బయట ఎవరికీ ఎలాంటి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదనీ, నేరుగా తాసిల్దార్‌నుగానీ, ఆర్డీవోనుగానీ సంప్రదించి, సమస్యలు పరిష్కరించుకోవచ్చని తెలిపారు, తాసిల్దార్ నారాయణతోపాటు రెవెన్యూ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు.

టీఆర్‌ఎస్‌లో చేరిన ఎంపీటీసీ
గంగాధర: గంగాధర మండలంలోని ఆచంపల్లి ఎంపీటీసీ కోలపురం లచ్చయ్య గురువారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మండలంలోని బూర్గుపల్లిలో ఎమ్మెల్యే రవిశంకర్ ఆయనకు కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. మండలంలో పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీరాం మధుకర్, సర్పంచులు మడ్లపెల్లి గంగాధర్, దార్నాల హన్మంతరెడ్డి, మాజీ ఎంపీపీ గంగాధర శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.

86
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles