7న ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రవేశ పరీక్ష

Fri,July 5, 2019 03:15 AM

తెలంగాణచౌక్: ప్రభుత్వం ఆద్వర్యలో తెలంగాణ స్టేట్ షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ కరీంనగర్ ఈ సంవత్సరానికి నిర్వహిస్తున్న ఫౌండేషన్ ఉచిత శిక్షణ ప్రవేశ పరీక్షను ఈ నెల 7వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్. బాల సురేందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలనుంచి 541 మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. జగిత్యాల రోడ్డులో గల వివేకానంద డిగ్రీ, పీజీ కళాశాలలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుదని పేర్కొన్నారు. అభ్యర్ధులు తమ హోల్ టికెట్లను www.tsscsstudycircle. telangana.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు 30 నిమిషాల ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలనీ, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను వెంట తేవద్దని సూచించారు. తప్పుగా గుర్తించిన ప్రతి ప్రశ్నకు 1/3 చొప్పున నెగెటివ్ మార్కులుంటాయని తెలిపారు. ప్రశ్నాపత్రం తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో ఉంటుందని పేర్కొన్నారు. హాల్‌టికెట్‌లో ఫొటో లేకుంటే దరఖాస్తులో వాడిన ఫొటోను అంటించి గెజిట్‌డ్ అధికారిచే ధ్రువీకరణ సంతకం చేయించాలనీ, దాంతోపాటు ఏదేని ప్రభుత్వం గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలని సూచించారు. వివరాల కోసం స్టడీ సర్కిల్ డైరెక్టర్‌ను గానీ, 9885218053 నెంబరులోగానీ సంప్రదించాలని పేర్కొన్నారు.

92
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles