ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌గా చిక్కుల కిరణ్

Thu,June 20, 2019 01:46 AM

సుభాష్‌నగర్: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జిల్లా కన్వీనర్‌గా నగరంలోని క్రిస్టియన్ కాలనీకి చెందిన చిక్కుల కిరణ్‌ను నియమిస్తూ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అప్పాల ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లో ఈనెల 16 నుంచి 18వ తేదీ వరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సైద్దాంతిక శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు అప్పాల ప్రసాద్ జిల్లా కేంద్రానికి చెందిన చిక్కుల కిరణ్‌ను జిల్లా కన్వీనర్‌గా నియమించారు. చిక్కుల కిరణ్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో నియమించిన ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు అప్పాల ప్రసాద్, జాతీయ కార్యవర్గ సభ్యుడు గోదా సత్యనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాచకొండ గిరిబాబు, ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ ప్రముఖ్ మంగు నర్సింహాద్రి, తదితరులకు కిరణ్ కృతజ్ఞతలు తెలిపారు.

78
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles