ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య

Tue,June 18, 2019 01:16 AM

- మధ్యాహ్న భోజనం, ఉచిత దుస్తులు
- జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌
- మేయర్‌తో కలిసి అక్షరాభ్యాసం ప్రారంభం
కరీంనగర్‌ ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా ఇంచార్జి కలెక్టర్‌ జివి. శ్యామ్‌ ప్రసాద్‌లాల్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో జరిగిన ఆచార్య జయశంకర్‌ బడిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లా విద్యాశాఖ అధ్యర్యంలో నిర్వహించిన సాముహిక అక్షరభ్యాసం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లోనే ఎక్కవ విద్యార్హతలు గల ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారిని అన్నారు. ప్రభుత్వ బడుల్లో చేరే విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు, ఉచిత మధ్యాహ్న భోజనం, ఉచిత ఏకరూప దుస్తులు ఇస్తున్నారని అన్నారు. తల్లిదండ్రులు విద్యార్థులను ప్రభుత్వ బడులకు పంపాలని, ప్రభుత్వ అందిస్తున్న రేషన్‌ బియ్యం, కళ్యాణలక్ష్మి, షాదిముభారక్‌ లాంటి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకున్నట్లే తమ పిల్లలను ప్రభుత్వ బడులకు పంపాలని సూచించారు. మేయర్‌ రవీందర్‌ సింగ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు వ్యాపార దోరణిని అవలంబించవని అన్నారు. ప్రభుత్వ పాఠశాల్లో చదివిన వారు నేడు అత్యున్నత స్థానాల్లో ఉన్నారని గుర్తచేశారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో ప్రభుత్వ బడుల్లో చదివిన విద్యార్థులు అత్యధికంగా పది జీపీఏలు సాధించారని అన్నారు. అనంతరం ప్రభుత్వ బడుల్లో ఒకటవ తరగతిలో నూతనంగా చేరిన విద్యార్థులకు కొత్త పలకులు, బలపాలు అందజేసి వారి చేత అక్షరాలు దిద్దించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాంమనోహర్‌ రావు, విద్యాశాఖ ఎడి అనురాధ, సెక్టోరల్‌ అధికారులు రాజభాను చంద్రప్రకాశ్‌, అనురాధ, వివిధ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరలు పాల్గొన్నారు.

78
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles